క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రష్మిగా మందన్న హీరోయిన్ గా నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. ఈ సినిమాను ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులో అధికారికంగా ఎంపికైంది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ చిత్రంతో పాటు మరో 28 చిత్రాలను ఈ లిస్టులోకి ఎంపికయ్యాయి. ఈ చిత్రాలన్నింటినీ స్క్రీనింగ్ చేసే వాటిలో మంచి చిత్రాన్ని ఎంపిక చేసి ఓ చిత్రాన్ని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆస్కార్‌కి పంపుతారు. `డియర్ కామ్రేడ్` మాత్రమే ఈ లిస్టులోకి ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. ప్రస్తుతం స్క్రీనింగ్ జరుగుతుంది. వీటిలో బెస్ట్ మూవీని ప్రకటిస్తారు. ప్రముఖ ఫిలిం మేకర్ అపర్ణ సేన్ అధ్యక్షతన ఈ జ్యూరీ పని చేస్తుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ;\lsdpri
previous post
next post