36.2 C
Hyderabad
April 25, 2024 20: 41 PM
Slider కడప

వివేకా హత్య కేసు దర్యాప్తులో తాత్కాలిక విరామం

#YSVivekanandaReddy

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో తాత్కాలిక విరామం ఏర్పడింది. కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారుల బృందం ఢిల్లీ వెళ్లిపోయింది.

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ గత రెండు వారాలుగా ప్రాథమిక విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కడప, పులివెందులలో సీబీఐ అధికారులు పలువురిని విచారించారు. వివేకా కుమార్తె సునీత, వైకాపా నేత శివశంకర్‌ రెడ్డి, పీఏ కృష్ణా రెడ్డి తదితరులను విచారించారు.

కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వివేకా కుమార్తె సునీత సమక్షంలో వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీదేవి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయ్‌ తుల్లాను అధికారులు విచారించారు. ఇంకా పలువురు అనుమానితులను విచారించనున్నారు.

తొలుత పదిరోజుల పాటు పులివెందుల వెళ్లి ప్రాథమిక దర్యాప్తు చేపట్టి వివేకా ఇంటిలో సీబీఐ అధికారులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. సిట్‌ దర్యాప్తు నివేదికను పులివెందుల పోలీసులు సీబీఐకి అప్పగించారు.

Related posts

వైభవంగా నల్లకుంట గణేష్ నిమజ్జన కార్యక్రమం

Satyam NEWS

ఈ మంత్రులా ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడేది?

Satyam NEWS

Breaking News: మంత్రి పెద్దిరెడ్డిపై గృహనిర్భంధం ఆంక్షలు

Satyam NEWS

Leave a Comment