21.2 C
Hyderabad
December 11, 2024 22: 22 PM
Slider తెలంగాణ

బస్సులో తాత్కాలిక డ్రైవర్ అఘాయిత్యం

pjimage (23)

ఓ తాత్కాలిక బస్ డ్రైవర్ మరో తాత్కాలిక మహిళా కండక్టర్ పై బస్సులోనే అత్యాచార యత్నం చేశాడు. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిన్న రాత్రి బస్సులో ప్రయాణీకులను ఎక్కించుకోకుండా పథకం ప్రకారం ఒంటరిగా ఉన్న కండక్టర్ పై బస్సులోనే అత్యాచార యత్నం చేశాడు డ్రైవర్ శ్రీనివాస్. చెన్నూరు నుండి నిన్న రాత్రి 7.30 గంటలకు మంచిర్యాల వస్తుండగా అటవీ ప్రాంతంలో బస్సు ఆపి డ్రైవర్ శ్రీనివాస్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అయితే ఆ కండక్టర్ పెద్దగా అరవడం, దగ్గరలో ఉన్న వాళ్ళు బస్సు వద్దకు వచ్చే ప్రయత్నం చేయడంతో బస్సును డ్రైవర్ ముందుకు తీసుకెళ్ళాడు. విషయం తెలిసిన జైపూర్ పోలీసులు జైపూర్ లో బస్సును ఆపి ఆ మహిళా కండక్టర్ ను రక్షించారు. శ్రీనివాస్ పై అత్యాచార యత్నం అనే కేసు కాకుండా అసభ్యంగా ప్రవర్తిచినట్టు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ విషయం బైటికి పొక్కకుండా రవాణా శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికి విషయం దాగలేదు.

Related posts

కొత్త ఏడాది ప్రారంభంలో మంత్రి బొత్స కొత్త సందేశం…!

Satyam NEWS

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి చిత్తశుద్ధి లేదు

Satyam NEWS

నందిగామ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

Satyam NEWS

Leave a Comment