అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం పాలయ్యారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తెనాలికి చెందిన వ్యాపారి గణేశ్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ (26) 2022లో ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లారు. టెన్నెసీ రాష్ట్రంలో చదువుతున్నారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టడంతో గాయాలై దుర్మరణం చెందారు. పరిమళ మృతదేహాన్ని తెనాలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
previous post
next post