ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ లోని కళాతపస్వి కె.విశ్వనాథ్ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. విశ్వనాథ్ ఆరోగ్యంగా ఉన్నారని ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని సీఎంవో వర్గాలు తెలిపాయి. కేసీఆర్ తనను కలవడం పట్ల విశ్వనాథ్ ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిపారు. విశ్వనాథ్ తో మర్యాదపూర్వక భేటీ సీఎం తో పాటు దర్శకుడు శంకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ ను దుశ్శాలువతో కేసీ ఆర్ గౌరవించారు.
previous post
next post