విశాఖపట్నం జిల్లా మధురవాడలో యూనిటీ మాల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున టెండర్లు ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్, జి.రేఖారాణి,ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. స్కీం ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ 2023-24లో భాగంగా విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం రూరల్ మండలం మధురవాడ రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 426/2 లో ఉన్న 5 ఎకరాల స్థలంలో యూనిటీ మాల్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున టెండర్ల ఆహ్వానానికి ప్రతిపాదన చేయడం జరిగిందని వివరించారు. సదరు టెండర్ డాక్యుమెంట్లు జ్యుడీషియల్ ప్రివ్యూ కోసం దాఖలు చేశామన్నారు. ఆసక్తి గల బిడ్డర్లు మరియు సాధారణ ప్రజలతో సహా స్టేక్ హోల్డర్ లు అందరూ ఏవైనా సలహాలు, రిమార్కులు మరియు అభ్యంతరాలు ఉంటే జ్యుడీషియల్ ప్రివ్యూకి http://judicialpreview.ap.gov.in, http://handlooms.ap.gov.in మరియు apjudicialpreview@gmail.com, handlooms_textiles@yahoo.com ఆన్ లైన్ వెబ్ సైట్ లేదా ఈ మెయిల్ ద్వారా 6 ఆగస్టు, 2024 (మంగళవారం) సాయంత్రం 5 గంటలలోగా తెలపాలని సూచించారు. ఇదే వెబ్ సైట్ లో ప్రజలు టెండర్ డాక్యుమెంట్ ను చూడవచ్చని తెలిపారు.
previous post