మరి కొద్ది నెలలో ఏపీ రాష్ట్ర డీజీపీగా గుప్తా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం.ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమల రావు జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈ మేరకు ఉత్తరాంద్ర పర్యటిస్తున్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లిన డీజీపీ ,28వ తేదీన విజయనగరం జిల్లా అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. ముందుగా విజయనగరం జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో సిబ్బందితో సమావేశమై గడచిన ఆరు నెలలో జరిగిన క్రైమ్,నిందితుల పట్టివేత,సిబ్బంది పనితీరుపై ఎస్పీ, డీఎస్పీలతో సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోడీజీపీ ద్వారాక తిరుమల రావు మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ అనేది అస్సలు లేదని స్పష్టం చేసారు. గంజాయి, పైబర్ క్రైమ్ లపై పోలీస్ శాఖ దృష్టి పెట్టి నిందితులను పట్టుకుందన్నారు. ఇక నకిలీ పోలీస్ అధికారులు యవ్వారంపై మాట్లాడుతూ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు.అనంతరం విజయనగరం ఆర్టీసీ డిపోను సందర్శించారు.