32.7 C
Hyderabad
March 29, 2024 11: 09 AM
Slider అనంతపురం

పోలీసుల ఓవర్ యాక్షన్ తో కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత

#kalyanadurgam

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆందోళన పోలీసుల జోక్యంతో ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో 5 రోజులపాటు రిలే నిరాహార దీక్షలకు రెండు రోజుల క్రితం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు.

పాత మార్కెట్లో టెంట్లు వేదిక కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే తెల్లవారి సరికి పోలీసులు మున్సిపాలిటీ అధికారులు వాటిని తొలగించి వేదికను ధ్వంసం చేశారు. ఈ సంఘటన పట్ల ఆగ్రహానికి గురైన తెదేపా నాయకులు కార్యకర్తలు స్థానిక ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీ చేపట్టారు. ర్యాలీని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా తీవ్ర వాగ్వాదం తోపులాట జరగటంతో పరిస్థితిగా ఉద్రిక్తతగా మారింది.

బలవంతంగా నియోజకవర్గ ఇన్చార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ను పోలీసులు ఎత్తుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో మిగిలిన పార్టీ నాయకులు కార్యకర్తలు స్టేషన్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇలా అధికార పార్టీ కనసన్నాలలో పనిచేయడం పట్ల ఉమామహేశ్వర నాయుడు తీవ్ర అగ్రహారం వ్యక్తం చేశారు.  

Related posts

శాల్యూట్: ఇండియన్ నావీ ప్రతిష్టాత్మక ఆపరేషన్ మొదలు

Satyam NEWS

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం

Satyam NEWS

వింతంతు పింఛన్ లో వాటా కొట్టేసిన వార్డు వాలంటీర్

Satyam NEWS

Leave a Comment