చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా కిశోరి ధాత్రక్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆగస్ట్ 3 నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాని భవానీ మీడియా డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. ఎంగేజింగ్ కంటెంట్‌తో తెరకెక్కిన ‘తెప్ప సముద్రం’ ఈ వీకెండ్ ఆహా ఓటీటీ ప్రేక్షకులకు అలరిస్తోందని యూనిట్ చెబుతున్నారు.
‘తెప్ప సముద్రం’ మూవీ కథ విషయానికి వస్తే తెప్ప సముద్రం అనే ఊరిలో అనుమానాస్పదంగా ఆడ పిల్లలు మిస్సవుతూ ఉంటారు. ఆ ఊరికి చెందిన గణేష్ (చైతన్య కృష్ణ) ఈ కేసుని సాల్వ్ చేసేందుకు అదే ఊరికి పోలీసాఫీసర్‌గా వస్తాడు. విజయ్ (అర్జున్ అంబటి) ఆ ఊళ్ళో అనాధగా పెరిగి ఆటో తోలుకుంటూ ఊళ్ళో అందరితో మంచిగా ఉంటాడు. ఆ ఊరి మిల్లు ఓనర్ గజ (చైతన్య దాత్రిక్) దగ్గర పనిచేస్తుంటాడు. అలాగే అదే ఊరికి చెందిన ఇందు (కిశోరి ధాత్రక్)ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తాడు కానీ చెప్పడు. కొన్నాళ్ల పాటు ఆగిపోయిన మిస్సింగ్ కేసులు మళ్ళీ మొదలవడంతో విజయ్, అతని ఫ్రెండ్స్ ని అనుమానించి అదుపులోకి తీసుకుంటాడు గణేష్.
మరోవైపు గజ బియ్యం అని చెప్పి విజయ్‌కి తెలియకుండా గంజాయి రవాణా చేయిస్తున్న విషయం విజయ్‌కి తెలుస్తుంది. ఆ కోపంతో గజని చంపేయాలనే కసితో వెళ్లిన విజయ్, అతని ఫ్రెండ్స్‌ని గజ మనుషులు చంపేస్తారు? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కేసుని గణేష్ ఎలా సాల్వ్ చేశాడు. ఇందు పరిస్థితి ఏంటి? వీటన్నింటికీ సమాధానమే ‘తెప్ప సముద్రం’ సినిమా.