36.2 C
Hyderabad
April 25, 2024 20: 51 PM
Slider ఆదిలాబాద్

బంజారాల అతి పవిత్రమైన పండగ తీజ్

#TeezFestival

బంజారాలు తీజ్ పండుగను అతి పవిత్రంగా నిర్వహిస్తారని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. అత్యంత భక్తి శ్రద్ద లతో ఈ  పండుగను జరుపుకుంటారని అన్నారు. ఈరోజు పాత ఉట్నూర్ లో తీజ్ పండుగల ఉత్సవాలలో పాల్గొని ఆయన ప్రసంగించారు.

ప్రధానంగా పెళ్లికాని యువతులు ఈ పండుగ నిర్వహిస్తారని అన్నారు. తీజ్ పండుగగా గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఈ తీజ్ పండుగను శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి నుంచి గోకులాష్టమి వరకు జరుపుకుంటారు.

బంజారాల కుల దేవత అయినా సీత్లా భవాని మాతకు శుభకరమై మంగళవారం రోజు పూజలు చేసి పండుగ భావిస్తారు. మా తీజ్ పండుగకు మొలకల పండుగగా పవిత్ర స్థానం ఏర్పరుచుకున్నది తీజ్ పండుగలో సేవబాయ దండి యాడి(మేరమ్మ )దేవతలను పూజిస్తారని అన్నారు.

ఈ తీజ్ పండుగ నవ రాత్రులు ఎంతోనిష్ఠతో జరుపుకుంటారని అన్నారు. ఈ పండుగ వల్ల గ్రామంలో ఐక్యత పెరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పండుగలను గుర్తించిన మొదటి ప్రభుత్వమని అన్నారు.

Related posts

క్వారీ పేరిట ఇసుక అక్రమ దందా

Satyam NEWS

ప్రియాంక హంతకులను బహిరంగంగా ఉరి తీయాలి

Satyam NEWS

మంత్రికి పార్టీ సభ్యత్వ పుస్తకాలు అందజేసిన నేతలు

Satyam NEWS

Leave a Comment