రాష్ట్రం లో ఇప్పుడిప్పుడే థాయ్ బాక్సింగ్ పట్ల క్రీడాకారుల నుంచి మంచి ఆధారణ లభిస్తోందని ఇదే సమయం లో ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని ఇండియన్ థాయ్ బాక్సింగ్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు డాక్షర్ కులదీప్ అన్నారు.
గురువారం కడప నగరం లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా పీపుల్ అగైనెస్ట్ కరప్షన్ వ్యవస్థాపకుడు మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తో పాటు హాజరు అయ్యారు. కడప వైయస్సార్ ప్రెస్ క్లబ్ లో సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడుతూ దక్షిణ భారతదేశం లో కూడా థాయ్ బాక్సింగ్ ను బలోపేతం చేస్తామని తెలిపారు.
థాయ్ బాక్సింగ్ వల్ల మానసికంగానే కాక శారీరకంగా దృఢంగా తయారు అవడానికి అదేవిధంగా స్వీయరక్షణ కు ఉపయోగపడుతుందని తెలిపారు. మిగతా క్రీడలలాగా ఉద్యోగ సాధన కు కూడా క్రీడా కోట లో థాయ్ బాక్సింగ్ ఉందని తెలిపారు. గ్రామీణ స్థాయి లో థాయ్ బాక్సింగ్ కు అవగాహన కల్పిస్తున్న జాతీయ కార్యవర్గానికి పీపుల్ అగనెస్ట్ కరెప్సన్ వ్యవస్థాపక అద్యక్షులు మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఎపి లోని అన్ని జిల్లా ల నుంచి థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆనందాచారి, ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ క్రిష్ణా రెడ్డి, అద్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ లతీష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ మరియు తదితరులు పాల్గొన్నారు.