నరసరావుపేట సమీపంలోని ఇస్సప్పాలెం గ్రామంలో నెలకొని ఉన్న సుప్రసిద్ధ దేవాలయం అయిన మహంకాళి అమ్మవారి దేవాలయానికి నూతన కమిటీని నియమించారు. ఈ కమిటీకి చైర్మన్ గా తొగటి వీర క్షత్రియ కులానికి చెందిన ప్రముఖ బీసీ నాయకుడు జల్లి శ్రీనివాసరావును నియమించారు.
తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవిని ఇచ్చినందుకు జల్లి శ్రీనివాసరావు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం మైనారిటీల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పొనుగుపాటి పూర్ణ చంద్రరావు నేడు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా సన్మానించారు.