పోలీస్ అంటే ఇలా ఉండాలి అనేలా గాంధీనగర్ పోలీసులు ప్రవర్తించారు. ఆదివారం రాత్రి సికింద్రాబాద్ లోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కు ఒక టెలిఫోన్ కాల్ వచ్చింది. బన్సీలాల్ పేట్ నుంచి రాజు యాదవ్ అనే ఒక వ్యక్తి ఫోన్ చేసి తమ ఇంటి వద్ద ఒక మహిళకు పురిటినొప్పులు వచ్చాయని ఆసుపత్రికి వెళ్లేందుకు మార్గం లేక ఇబ్బంది పడుతున్నదని చెప్పాడు.
ఫోన్ కాల్ అందుకున్న డిటెక్టీవ్ ఇన్స్పెక్టర్ తక్షణమే స్పందించారు. ఆయన సిబ్బందిని తీసుకుని తన వాహనంలో అక్కడకు వెళ్లి విచారించారు. బీహార్ కు చెందిన సంధ్యా దేవి అనే మహిళ పురిటి నొప్పులతో ఉండటం చూసి వెంటనే ఆమెను తన కారులో ఎక్కించి సుల్తాన్ బజార్ లోని మెటర్నిటీ ఆసుపత్రికి పంపించారు.