37.2 C
Hyderabad
April 18, 2024 20: 53 PM
Slider మెదక్

దటీజ్ తెలంగాణ: కన్నీళ్లు ఇక లేవు అన్నీ సాగు నీళ్లే

#RanganayakaSagar

కాలిపోయిన మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు లేవు. ఇంత కాలం రైతులు, కరెంట్, కాలం మీద ఆధారపడి వ్యవసాయం చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఒకనాడు ఇక్కడి రైతుల పరిస్థితి అప్పులతో ఆత్మహత్య చేసుకునే వారు… ఇప్పుడు ఆ పదం వినిపించే పరిస్థితి పోయింది.

ఏడాది పొడవునా నీళ్లు… పచ్చని పొలాలు… రైతు బతుకు మారడం అంటే ఇదే. ఈ కలను సాకారం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మొత్తం కార్యభారాన్ని మోసిన వ్యక్తి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్ రావు. నేడు ఈ ప్రాంత రైతులతో బాటు ప్రజా ప్రతినిధులు కూడా హద్దులు మరచి నీటిలో ఈత కొట్టారు. ఎన్నడూ చూడని నీరు పారుతుంటే మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు.

జలజలా పారిన రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు

గంగమ్మతల్లికి పూజలు చేరారు నిండుగా పారాలని మనసారా కోరుకున్నారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం  చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదలకు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అంతకు ముందు మల్లన సాగర్ ప్రాజెక్ట్ టన్నెల్ నాలుగవ గేట్ ఎత్తి నీళ్లు విడుదల చేశారు ఇరిగేషన్ ఈఎన్సీ హరిరామ్. ఇక కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తీసేస్తున్నామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ప్రధాన కుడి కాలువ ద్వారా 40వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాలు సాగునీరు అందుతున్నది.

చెక్ డామ్ లు చెరువులు కూడా నింపేద్దాం

ప్రాథమికంగా చెరువులు, చెక్ డ్యామ్, కుంటలు, వాగులు, వంకలు వేసవి కాలంలోనే నింపుతాం. సిద్ధిపేట వాగు కింద 28 చెక్ డ్యామ్ లు శనిగరం చెరువును కూడా పెద్ద మొత్తంలో నింపుతాం. నక్కవాగు, పెద్దవాగు కింద ఉండే చెక్ డ్యామ్ లు నింపుతాం. మైనర్, సబ్ మైనర్ కాలువల తవ్వకాలకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.

వర్షాకాలం వరకు పిల్ల కాలువలు పూర్తి చేసుకోవాలి. కాలువలు తవ్వడానికి ఇదే సరైన సమయం అంటూ పిలుపునిచ్చారు హరీష్ రావు. తెలంగాణ మారిపోతున్నది. రైతుల కంట కన్నీరు కాదు… కాలువల వెంట బిరబిరా గోదారమ్మ పరిగెడుతుంటే, రైతుల కళ్లల్లో ఆనందభాష్పాలు కారుతున్నాయి. దటీజ్ తెలంగాణ.

Related posts

మతం మార్చిన ఎపిసోడ్: చివరకు క్షమాపణలు

Satyam NEWS

చిరు ధాన్యాల ఆహారం శ్రేష్టం

Murali Krishna

రెస్పాన్స్ బిలిటీ: పల్స్ పోలియోపై విద్యార్ధుల ప్రతిజ్ఞ

Satyam NEWS

Leave a Comment