27.7 C
Hyderabad
March 29, 2024 03: 12 AM
Slider మెదక్

2వ విడత కంటి వెలుగును విజయవంతం చేయాలి

#Tanniru Harish Rao

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుండి నిర్వహించు కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించారు.

సోమవారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం శుభం ఫంక్షన్ హాల్ లో రెండవ విడత కంటి వెలుగు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో రాష్ట్రంలో ఎవరు కూడా దృష్టి లోపంతొ బాధాపడకూడదన్న ధ్యేయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి మొదటి విడతలో 1కోటి 54 లక్షల మందికి కంటి పరీక్షలను నిర్వహించి 50 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలను అందించడం జరిగిందని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని గ్రామ పంచాయితి, మున్సిపల్ వార్డులలో జనవరి 18వ తేది నుండి కంటివెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని 250 కోట్ల రూపాయలతో నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు గాను 1500 బృందాలు 100రోజుల పనిదినాలలో ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు క్యాంపును నిర్వహించేలా ప్రణాళికను రూపొందించు కోవడం జరిగిందని అన్నారు, గతంలో 827 బృందాలు కంటి వెలుగులో పనిచేయగా, ఇప్పుడు ఆ సంఖ్యను 1500కు పెంచడం జరిగిందని,

ప్రతి క్యాంపులో 1 మెడికల్ అధికారి, 1 అప్తామాలజిస్టు, 2 ఎఎన్ఎం లు, 3 ఆశాలు,1 డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారని, క్యాంపును నిర్వహించడానికి బృందం స్థానికంగా ఉండేలా వారికి వసతి, బోజనం కొరకు రోజుకు 1500 రూపాయలను అందించడం జరుగుతుందని, అదే విధంగా క్యాంపు వద్ద షామియానా, మంచినీరు, కుర్చీలు, టెబుల్ ఏర్పాటుకు మరో ప్రతి రోజూ వెయ్యి రూపాయల చోప్పున పంచాయతీలకు, మున్సిపాల్టీలకు ముందుగానే విడుదల చేయడం జరుగుతుందని, దీనిని పూర్తి స్థాయిలో వినియోగించు కోవాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. వీరికి ఒక వాహనాన్ని కూడా కేటాయిచడం జరుగుతుందని పేర్కోన్నారు.

ఈ బృందంలో అనుకోని పరిస్థితులను సమర్దవంతంగా ఎదుర్కోనేలా 5శాతం అదనపు సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. పూర్తిగా ఆన్ లైన్ స్క్రినింగ్, కంప్యూటరైజ్డ్ ఐ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా రాష్ట్ర స్థాయిలో 10 క్యాలిటి కంట్రోల్ టీం లను , జిల్లా స్థాయిలో ఒక టీమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ టీం ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేధికను అందిస్తారని తెలిపారు. కంటి వెలుగు బృందానికి ఇప్పటికే ఎల్.వి. ప్రసాద్, డా. సరిజిని కంటి ఆసుపత్రులలో శిక్షణకు కూడా అందివ్వడం జరిగిందని తెలిపారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఖచ్చితంగా క్యాంపు నిర్వహించాలని, ఆ దిశగా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని తెలిపారు. సాధారణ వైద్యసేవలకు అంతరాయం

కలుగకుండా 929 డాక్టర్ లను నియమించడం జరిగిందని, కంటివెలుగు కార్యక్రమాన్ని ఎక్కడ ఎప్పుడు నిర్వహిస్తారనే పూర్తి సమాచారాన్ని ప్రజలకు చేరేలా చూడాలని అన్నారు కార్యక్రమ నిర్వహణపై గ్రామ పంచాయితీ,మునిసిపల్ వార్డు స్థాయిలో మండల పరిషద్ అధికారులు మండల ప్రత్యేక అధికారులు zptc,mptc, mpp, sarpanch,ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు శిభిరంలో కంటిపరీక్షలు పూర్తయిన వెంటనే రీడింగ్ అద్దాలను అందించడం జరుగుతుందని, ప్రిస్క్రీష్షన్ అద్దాలను శిభిరం నుండే ఆన్ లైన్ ద్వారా నమోదు చేయడం జరుగుతుందని,

15రోజుల్లో అద్దాలు కంపెనీల నుండి శిభిరాలకు వస్తాయని వాటిని ఆశా, ఎఎన్ ఎం ల ద్వారా లబ్దిదారులకు అందించడం జరుగుతుందని పేర్కోన్నారు. ఇందుకోసం 60 లక్షలు రీడింగ్ అద్దాలను, ప్రిస్క్రీష్షన్ అద్దాలను అందించనున్నమని అన్నారు మెదక్ జిల్లాలో 469 గ్రామపంచాయతీలు నాలుగు మున్సిపల్ వార్డులలో 472802 మందికి కంటి పరీక్షలు నిర్వహించుటకు 544 వివరాలను శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని ఇందుకోసం 40 బృందాల తో పాటు అదనంగా మరో ఐదు బఫర్ బృందాలను సిద్ధంగా ఉంచుతున్నామని అన్నారు జిల్లాలోని అన్ని చౌక ధర దుకాణాలలో కంటి శిబిరాలు నిర్వహించే తేదీ ఫ్లెక్సీలు ప్రదర్శించడంతోపాటు టాం టాం వేయాలని మైక్రో ద్వారా ప్రచారం చేయాలని సూచించారు అదేవిధంగా ప్రతి గ్రామపంచాయతీలో ప్రతి మున్సిపల్ వార్డులో ఫ్లెక్సీలు ఏర్పాటు

చేయడంతో పాటు శిబిరాలు ఏర్పాటుపై వాహనం ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కలిగించాలని మంత్రి సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి పద్మాదేవేందర్ రెడ్డి మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి చైర్మన్ ప్రతాపరెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా గ్రంధాల సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్ జిల్లా కలెక్టర్ హరీష్ కలెక్టరు అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తదితర ప్రజా ప్రతినిధులు అధికారులు వైద్యులు పాల్గొన్నారు చైర్పర్సన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లు పర్యవేక్షించాలని సూచించారు.

Related posts

అమెరికా దాడితో భగ్గుమన్న ఇరాన్ పెట్రోల్

Satyam NEWS

స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి : సీఐటీయూ డిమాండ్

Satyam NEWS

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శార్వానంద్, రష్మిక

Satyam NEWS

Leave a Comment