31.7 C
Hyderabad
April 18, 2024 23: 18 PM
Slider ఖమ్మం

అభ్యర్థులందరినీ గెలిపించుకోవడమే లక్ష్యం

#ponguleti

జెండా ఏదైనా ఏజెండా ఒక్కటేనని, రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంజిల్లా నుంచి శీనన్న సైన్యంగా పోటిచేసే పదిమంది అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యమని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలంలోని నెహ్రు సెంటర్లో పొంగులేటి శీనన్న, కోరం కనకయ్యల క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయగా దానిని  పొంగులేటి ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి శీనన్న క్యాంపు కార్యాలయాన్ని ఇల్లందులో ప్రారంభించడం జరిగిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య నేతృత్వంలో ఈ క్యాంపు కార్యాలయం పనిచేస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడున్న సిబ్బంది ఇల్లందు నియోజకవర్గ ప్రజానీకానికి నిత్యం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పొంగులేటి శీనన్న క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు అవుతాయని ఈ సందర్భంగా వివరించారు.

ఇల్లందు నియోజకవర్గ పర్యటనలో భాగంగా గార్ల మండలం, టేకులపల్లి మండలం, ఇల్లందు మండలం, ఇల్లందు పట్టణాల్లో పొంగులేటి పర్యటించారు. గార్ల మండలంలోని మర్రి గూడెంలో వేట వెంకటేశ్వరస్వామిని గుడిని సందర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. పీక్ల తండాలో ఆర్మీ జవాన్ భూక్యా రమేష్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అదేవిధంగా మూడ్ తండా , గార్ల, ఇల్లందు మండలంలోని రేపల్లెవాడ, ఇల్లందు పట్టణం, టేకులపల్లి మండలంలోని బోడ్, 9వ మైల్ తండాల్లో పొంగులేటి పర్యటించారు. ఆయా కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆర్థిక సాయాలను కూడా అందజేశారు. పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, ఇల్లందు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు.

Related posts

ఎన్నిక ఏదైనా టిఆర్ఎస్ దే గెలుపు

Satyam NEWS

కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీపై హైకోర్టు స్టే

Sub Editor 2

కరోనా కట్టడిలో రెచ్చిపోతున్న బియ్యం మాఫియా

Satyam NEWS

Leave a Comment