34.2 C
Hyderabad
April 19, 2024 21: 55 PM
Slider కడప

చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ సరైనదేనని తేల్చిన కేంద్రం

#Chandrababu

ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ కులాలకు 10 శాతం ఈ డబ్ల్యూ ఎస్ కేంద్రం కేటాయించగా ఇందులో 5 శాతం కాపులకు రిజర్వేషన్ గా చంద్రబాబునాయుడు ఇచ్చారని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు. దీన్ని సరైన విధానంగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందని, ఇప్పుడు రాష్ట్రంలోని కాపులకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలోని కాపులను జగన్ మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. గురువారం కడప నగరంలోని హరి టవర్స్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు పర్సెంట్ కాపు రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని తప్పుడు ప్రచారం చేశారని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశంలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని కేంద్రం తేల్చి చెప్పిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నాడు టీడీపీ తీసుకున్న నిర్ణయం సరైనదే నని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పినట్టయిందన్నారు. జగన్ అధికారం చేపట్టిన తర్వాత అగ్రవర్ణ కులాల పేదలు 56 వేల అర్హులు కాగా అందులో కాపు బలిజల 28 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. అలాగే కాంట్రాక్ట్,అవుట్సోర్సింగ్ కింద మరో 21 వేల ఉద్యోగాలు అంటే మొత్తం 49 వేల ఉద్యోగాలను కాపు,బలిజలకు దక్కకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.

కాపు కులస్తులకు జగన్ చేసిన ద్రోహం అర్ధం అయిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాపుల పైన కక్షతో జగన్ అధికారం చేపట్టిన తర్వాత కాపు రిజర్వేషన్ ని పక్కన పెట్టారన్నారు. అప్పటి తెలుగుదేశం పార్టీ కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఎలా కల్పిస్తారు అంటూ జగన్ వితండవాదం చేసారన్నారు. నిన్న జరిగిన పార్లమెంటు సమావేశంలో జగన్ వితండవాదాన్ని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసిదన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా బలిజ సంఘం అధ్యక్షుడు గోపిశెట్టి నాగరాజు,సంఘ నాయకులు మిరియాల నరసింహులు, సజ్జా సాయి,గంధం మోహన్,చెన్నంశెట్టి బ్రహ్మాయ్య, ఎసికే రమణయ్య దండు రవి పాల్గొన్నారు.

Related posts

శిశువు బతికి ఉండగానే ఖననం చేసే యత్నం

Satyam NEWS

విపక్షాలు అన్నీ ఎక్కతాటిపైకి రావాలి

Bhavani

అమిత్ షాతో కీలక అంశాలను చర్చించిన రఘురామకృష్ణంరాజు

Satyam NEWS

Leave a Comment