37.2 C
Hyderabad
April 19, 2024 11: 27 AM
Slider మెదక్

మందుల ధరలు పెంచేసిన కేంద్ర ప్రభుత్వం

central government

ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12% పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య.

జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలకి భారం అవుతుంది అని ఆయన అన్నారు.

సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బిజెపి ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది. అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైంది. ఇది అత్యంత బాధాకరం. దుర్మార్గమైన చర్య. ఇదేనా బిజెపి చెబుతున్న అమృత్ కాల్..?? ఇవి అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్.. దేశంలో బిజెపి పాలనకు రోజులు దగ్గర పడ్డాయి అని ఆయన అన్నారు.

Related posts

చాక్లెట్ కావాలా బాబూ: భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్

Satyam NEWS

15వ రాష్ట్ర పతిగా దళిత మహిళ ప్రమాణస్వీకారం… దేశ వ్యాప్తంగా సంబరాలు

Satyam NEWS

ప్రతి చివరి ఎకరాకు నీళ్ళు అందించాలని సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవ

Satyam NEWS

Leave a Comment