35.2 C
Hyderabad
May 29, 2023 21: 29 PM
Slider ఖమ్మం

వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

#medical college

ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ పాత కలెక్టరేట్ లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు చేపడుతున్న పునర్నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు.

టీచింగ్ గది, ఫిజియాలజి ల్యాబ్, హేమటాలజీ ల్యాబ్, బయో కెమిస్ట్రీ, మ్యూజియం, లెక్చర్ హాల్, పరిపాలన కార్యాలయం తదితరాలను పరిశీలించారు. పనుల పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రికల్, సానిటరి, డోర్ ల ఏర్పాటు పనులు చేయాల్సి వున్నదని అన్నారు. రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని జూన్ 14న వైద్యానికి

సంబంధించి కార్యక్రమం చేపట్టనున్నట్లు, ఆ లోగా లోపలి, బయటి పనులన్నీ పూర్తి చేసి, కళాశాలను అన్ని విధాలుగా సిద్ధం చేయాలన్నారు. జూన్ 14 న వైద్య కళాశాలను విద్యుత్ దీపాలతో అలంకరించి, విధులందు చేరిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పరిచయ కార్యక్రమం చేపట్టాలని, వైద్య కళాశాల ఏర్పాటు సంబరాలు చేయాలని కలెక్టర్ అన్నారు.

Related posts

జర్నలిస్టులపై దాడులు పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు

Bhavani

పోలియో నిర్మూలన మనందరి బాధ్యత: ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS

మంగమారిపేట బీచ్ లో పెను విషాదం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!