27.7 C
Hyderabad
April 26, 2024 05: 25 AM
Slider వరంగల్

జిల్లా విద్యా వైజ్ఞానిక సదస్సును జయప్రదం చేయాలి

#GPani

ఈ నెల 7, 8, 9 తేదీలలో ములుగు జిల్లా బండారుపల్లి ఆదర్శ పాఠశాలలో జరగబోయే జిల్లా ఇన్స్పైర్ విద్యా వైజ్ఞానిక సదస్సును జిల్లాలోని ఉపాధ్యాయులు అందరూ విజయవంతం చేయాలని ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని కోరారు. శనివారం బండారుపల్లిలోని ఆదర్శ పాఠశాలలో జరిగిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 29 ప్రాజెక్టులు ఇన్స్పైర్ కార్యక్రమం కింద సెలెక్ట్ అయ్యాయని వాటితో పాటుగా జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతి పాఠశాల నుండి కనీసం రెండు ప్రదర్శనలు సైన్స్ ఫెయిర్ కి తీసుకురావాలని సూచించారు.

అత్యధికంగా సైన్స్ ప్రదర్శనలు తీసుకువచ్చి రాష్ట్రస్థాయిలో ములుగు జిల్లాను ముందు ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఫెయిర్ నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీలు వారు చేయవలసిన పనులను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, స్థానిక మండల విద్యాశాఖ అధికారి సామల శ్రీనివాసులు, కార్యాలయ కోఆర్డినేటర్లు బద్దం సుదర్శన్ రెడ్డి, రమాదేవి, సాంబయ్య, రాజు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శోభారాణి, అన్ని మండలాల ఎంఈఓ లు, వివిధ కమిటీల కన్వీనర్లు సభ్యులు పాల్గొన్నారు.

Related posts

ఎలక్షన్ గిమ్మిక్: పసుపు హబ్ తో ఏమి ప్రయోజనం?

Satyam NEWS

వేరుశనగ విత్తనాల పై నోరు విప్పని వ్యవసాయ మంత్రి

Satyam NEWS

డ్రై డే ను పకడ్బందీగా అమలు చేయాలి

Bhavani

Leave a Comment