28.7 C
Hyderabad
April 20, 2024 05: 47 AM
Slider ప్రపంచం

The End: బిల్ గేట్స్, భార్య మిలిందా విడాకులు

#BillGates

27 సంవత్సరాల వివాహ బంధాన్ని మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా ముగించారు.

ఇక వివాహ బంధాన్ని కొనసాగించే స్థితిలో ఇద్దరం లేమని వారు ప్రకటించారు. ఈ విషయాన్ని బిల్ గేట్స్ స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఎంతో తర్జన భర్జన పడ్డామని అయితే విడిపోవడం తప్ప తమకు పరిష్కారం కనిపించలేదని ఆయన అన్నారు.

27 సంవత్సరాల తమ వైవాహిక జీవితంలో తమకు ముగ్గురు పిల్లలు కలిగారని ఆయన తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి సేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థను తాము ఇరువురం కలిసి స్థాపించామని ఆయన అన్నారు.

తమ వివాహ బంధం విచ్ఛిన్నం అయినా మిలిందా బిల్ గేట్స్ ఫౌండేషన్ మాత్రం కొనసాగుతుందని బిల్ గేట్స్ తెలిపారు.  

Related posts

చిత్రావతి ముంపు గ్రామంలో తీవ్ర ఉద్రికత్త

Satyam NEWS

కైకాల‌కు మెగా బ్ర‌ద‌ర్స్ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు

Satyam NEWS

కరోనాతో ఒక్కరోజే 9 మంది మృతి

Bhavani

Leave a Comment