36.2 C
Hyderabad
April 18, 2024 14: 50 PM
Slider శ్రీకాకుళం

శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్

శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్ అని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగనన్న భూ హక్కు ఏమిటి? జగన్ తాత, తండ్రి ఆస్తులు పంచుతున్నారా? అని ప్రశ్నించారు. సీఎంకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. పాస్‌బుక్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు అన్నిటిపైనా తన ఫోటో పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం జిల్లాల పర్యటనలకు భయపడుతున్నారని అన్నారు. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడుతున్నారన్నారు.

తెల్లవారితే భూములు ఎలా కబ్జా చేయాలన్న ఆలోచన తప్పా మరొకటి లేదని అన్నారు. మూడేళ్ళలో ఉత్తరాంధ్ర కు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. జగనన్న కాలనీల్లో భారీ అవినీతి దాగి ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

Related posts

పెట్రో ధరలపై విజయవాడలో వామపక్షాల నిరసన

Satyam NEWS

గుడ్ వర్క్: నేతన్నలకు వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చేయూత

Satyam NEWS

పోతిరెడ్డిపాడుపై రాజీలేని పోరాటం చేస్తున్నాం

Satyam NEWS

Leave a Comment