31.7 C
Hyderabad
April 19, 2024 00: 51 AM
Slider గుంటూరు

హత్యాయత్నం కేసును గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు

#Ravi Shankar Reddy

పల్నాడు జిల్లా రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అలవాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు వెన్నా బాల కోటి రెడ్డి పై కాల్పులు జరిపిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా పోలీస్ బాస్ రవిశంకర్ రెడ్డి తెలిపారు.

ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి,హత్యాయత్నానికి ఉపయోగించిన తుపాకీని రొంపిచర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఎస్ పి తెలిపారు. పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వివరాలు వెల్లడించారు.

నిందితులపై CR.NO. 18/2023 U/S 307 r/w 34 IPC and Sec.25, Sec. 27 of Arms act, 1959 Of Rompicherla PS కింద కేసు నమోదు చేసి,నరసరావుపేట డిఎస్పీ విజయభాస్కరరావు పర్యవేక్షణలో నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి, రొంపిచర్ల ఎస్సై సురేష్ దర్యాప్తు చేశారు.

ఈ కేసులో

  1. పమ్మి వేంకటేశ్వర రెడ్డి s/o రామ కోటి రెడ్డి, 46 సంవత్సరాలు, రెడ్డి కులం,ఆలవాల గ్రామం, రొంపిచెర్ల మండలం, పల్నాడు జిల్లా.
  2. పులి అంజి రెడ్డి s/o వెంకట సుబ్బారెడ్డి, 38 సంవత్సరాలు , రెడ్డి కులం , దొండపాడు గ్రామం నరసరావుపేట మండలం, ప్రస్తుతం 7 వ లైను నల్ల చెరువు గుంటూరు టౌన్
  3. వంటిపులి వెంకటేశ్వర్లు s/o ఏడుకొండలు, 38 సంవత్సరాలు, వడ్డెర కులం నుదురూపాడు గ్రామం ఫిరంగిపురం మండలం గుంటూర్ జిల్లా.
  4. పూజల రాములు, s/o నాసరయ్య, 34 సంవత్సరాలు, యాదవ కులం,ఆలవాల గ్రామం, రొంపిచెర్ల మండలం, పల్నాడు జిల్లా. అనే నిందితులను అరెస్ట్ చేశారు.
    గత పంచాయతీ ఎలక్షన్లలోను, అలవాలా గ్రామంలో జరుగు ప్రసన్నంజనేయ స్వామి తిరునాళ్ళకు సంబంధించి వివాదం కారణంగా ఈ ఘటన జరిగినట్లు ఎస్ పి తెలిపారు.

Related posts

ముద్దు సీనుతో రక్తికట్టిన బిగ్ బాస్

Satyam NEWS

పెళ్లిచేసుకుంటానని నమ్మించి స్నేహితులతో కలిసి అత్యాచారం

Satyam NEWS

చదువుతోనే భవిష్యత్

Bhavani

Leave a Comment