27.7 C
Hyderabad
March 29, 2024 02: 14 AM
Slider విజయనగరం

ఒక్క రోజులో హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

విజయనగరం పట్టణం కె.ఎల్.పురంకు చెందిన తోరోతు రమణ ఈ నెల 25వ తేదీ 11 గంటల సమయంలో విజయనగరం 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన కుమారుడు తోరోతు నవీన్ (19 సం.లు) ఈ నెల 24వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో మతాబు సామాన్లు పట్టుకొని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయి, తిరిగి ఇంటికి రానట్లు, తన కుమారుడు ద్వారపూడి రైల్వే ట్రాక్ సమీపంలో సిమెంటు కాలువలో మృతి చెంది ఉన్నట్లుగా ఈ నెల 25 వ తేదీన ఉదయం కొంతమంది వ్యక్తులు ద్వారా తెలుసుకొని, అక్కడకు వెళ్ళి చూచి, తన కుమారుడు శవాన్ని తన బంధువుల సహాయంతో ఇంటికి తీసుకొని వెళ్ళినట్లు, అక్కడ తన కుమారుడి శవంపై గాయాలు ఉండడంతో, తన కుమారుడిని ఎవరైనా చంపి ఉంటారని అనుమానంతో ఫిర్యాదు చేసారు.

ఈ ఫిర్యాదుపై విజయనగరం 1వ పట్టణ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ ఎం. దీపిక, ఆదేశాలతో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ టి. త్రినాధ్ ఆధ్వర్యంలో విచారణ
చేపట్టిన 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు 1వ పట్టణ ఎస్ఐలు అశోక్, రామ గణేష్, విజయకుమార్, దుర్గా ప్రసాద్ లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారు. ఈ బృందాలు మృతుడి స్నేహితులను విచారణ చేయగా, మృతి చెందిన నవీన్, బ్రహ్మాజీ ఇరువురు బాల్యం నుంచి మంచి స్నేహితులని, తరుచూ ఇద్దరు కలిసి తిరుగుతారని తెలుసుకున్న పోలీసులు,
బొద్దూరు బ్రహ్మాజీ అలియాస్ బాలు అనే వ్యక్తి నవీన్ హత్య జరిగిన తరువాత పరారీలో ఉండడంతో, అనుమానంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టారు. విచారణలో నిందితుడు బ్రహ్మాజీ (బాలు) నవీనన్ను హత్య చేసినట్లుగా అంగీకరించాడు.

తాను ప్రేమించిన అమ్మాయికి తోరోతు నవీన్ (19 సం.లు) తరుచూ వాట్సాప్ సందేశాలు పంపుతూ, కాల్స్ చేస్తూ, వేధింపులకు పాల్పడుతున్నట్లు, సదరు విషయమై తాను చాలా సార్లు నవీన్ ను హెచ్చరించి నప్పటికి అతనిలో మార్పు రాలేదని, అతని నంబరును సదరు మహిళ బ్లాక్ చేసినప్పటికి, వేరు వేరు ఫోను నంబర్లుతో మెసేజ్లు పంపుతున్నట్లుగా ఆమె బ్రహ్మాజీ (బాలు)కు తెలపడంతో, ఒక పథకం ప్రకారం నవీన్ ను హత్య చేసినట్లుగా అంగీకరించాడు.

ఇందులో భాగంగా, హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం ఇరువురు కలిసి మద్యం సేవించినట్లు, హత్యచేసేందుకు అవకాశం కుదరకపోవడంతో ఎవరికి వారు వెళ్ళిపోయామన్నారు. రాత్రి 8 గంటల తరువాత బ్రహ్మాజీ (బాలు) మరియు నవీన్ ఇరువురు కలసి ద్వారపూడి రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్ళినట్లు,ఇరువురు సదరు అమ్మాయి విషయంలో వాదనలు పడినట్లు, నవీన్ దురుసుగా మాట్లాడుతూ బ్రహ్మాజీ (బాలు)ను త్రోసి వేయడంతో, అక్కడ అందుబాటులో ఉన్న సరుగుడు కర్రను తీసి, నవీన్ ను బలంగా కొట్టి, హత్య చేసినట్లుగా డిఎస్పీ మీడియాకు వివరాలను వెల్లడించారు. హత్య అనంతరం బ్రహ్మాజీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి, బట్టలను బాత్ రూంలో విడిచిపెట్టి, బయటకు వెళ్ళిపోయాడన్నారు. హత్య అనంతరం, బ్రహ్మాజీ పరారీలో ఉండడంతో అనుమానంతో అతని గురించి గాలించి, అదుపులోకి తీసుకొని, వాస్తవాలను రాబట్టినట్లుగా డిఎస్పీ తెలిపారు. ఈ కేసును ఒక్క రోజు వ్యవధిలో ఛేదించుటలో 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు, ఎస్ఐలు అశోక్, రామ గణేష్, దుర్గా ప్రసాద్, విజయకుమార్, లక్ష్మణరావులు సమర్ధవంతంగా పని చేసారని, వారిని డిఎస్పీ టి.త్రినాధ్ అభినందించారు.

విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషనులో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం వన్ టౌన్ సిఐ డా. బి. వెంకటరావు, ఎస్ఐ వి.అశోక్ కుమార్ , హెచ్ సీ అచ్చిరాజు, పీసీ అనిల్ పాల్గొన్నారు.

Related posts

ఇది చెరువు కాదు… జగనన్న కాలనీ

Satyam NEWS

రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ కు చెప్పుల దండ

Satyam NEWS

చెత్త పన్ను వేయాలనే ఆలోచన చెత్త ప్రభుత్వాలకే వస్తుంది

Satyam NEWS

Leave a Comment