39.2 C
Hyderabad
March 29, 2024 16: 50 PM
Slider కర్నూలు

ఎమ్మిగనూరు మార్కెట్‌లో భారీగా పతనమైన టమాట ధర

#tomato

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటా ధర భారీగా పతనమైంది. గత 10 రోజులుగా ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటాకు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో రూపాయి పలకడంతో టమోటా రైతులు రవాణా ఖర్చు కూడా రావడం లేదని వాపోతున్నారు.

కొందరు తెచ్చిన టమోటా బాక్స్ లను మార్కెట్ లోనే వదిలి వెళ్లిపోతుండగా.. కొందరు రోడ్డుపైనే పారబోస్తున్నారు. ఇప్పటికైనా గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని టమోటా రైతులు కోరుతున్నారు.

Related posts

మెదక్ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు

Bhavani

ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఖాసిం అరెస్ట్

Satyam NEWS

వ్యాయామ ఉపాధ్యాయులు మధ్యాహ్నమే స్కూలుకు వెళ్లాలి

Satyam NEWS

Leave a Comment