37.2 C
Hyderabad
April 19, 2024 13: 54 PM
Slider ఖమ్మం

ప్రభుత్వ ఉదాసీనతే కారణం

#pdsu-pyl

టీఎస్పీఎస్సీ సక్రమంగా పరీక్షలు నిర్వహించకుండా పేపర్లు అమ్ముకొని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చే కుట్రలను నిరుద్యోగ లోకం తిప్పికొట్టాలని పివైఎల్, పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు ప్రదీప్,నామాల ఆజాద్ లు పిలుపునిచ్చారు. నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్న టీఎస్పీఎస్సీ కమిషన్ సర్కారు తీరుకు నిరసనగా పిడిఎస్యు పి వై ఎల్ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి మయూరి సెంటర్ వరకు నిరశన ర్యాలీ నిర్వహించి మానవహారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ పాలనలో లీకేజీ ప్యాకేజీ పేరుతో నిరుద్యోగులను డ్యామేజ్ చేసి వారి నోట్లో మట్టి కొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం సమయానికి తినకుండా, ఐదు రూపాయల భోజనం తింటూ, ఆరోగ్యాలు పాడవుతున్న లెక్కచేయకుండా, సొంత కుటుంబాలకు దూరంగా ఉంటూ, అప్పులు చేసి లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకొని  ఉద్యోగం వస్తుంది అనే ఆశతో నిరుద్యోగులు ఎదురు ఎదురు చూస్తుంటే టీఎస్పీఎస్సీ మాత్రం పేపర్లు అమ్ముకొని లక్షల రూపాయలు దోచుకుంటున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.   

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ కమిషన్ పాత్ర పై తక్షణ చర్యలకు ప్రభుత్వం పూలుకోవాలని  డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన పరీక్షలు ఇప్పుడు నిర్వహించబోయే పరీక్షలపై ఈ లీకేజీ పాత్ర ఎంతవరకు ఉంది అనేది దర్యాప్తు జరిపి నిరుద్యోగులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యతను ప్రభుత్వం నిర్వహించకపోతే నిరుద్యోగుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో ఉన్నది టీఎస్పీఎస్సీ కమిషన్ కాదు లీకుల కమిషన్, ఈ లీకుల కమిషన్ను ప్రక్షాళన చేసి టీఎస్పీఎస్సీ కమిషన్ గా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక రాష్ట్ర పెద్దల హస్తం ఉందని దీనిపై సిట్టింగ్ జడ్జిచే విచారణకు ప్రభుత్వం ఆదేశించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు పి వై ఎల్ ఖమ్మం జిల్లా కార్యదర్శిలు వి వెంకటేష్ ఎన్ వి రాకేష్ పి వై ఎల్ రాష్ట్ర నాయకులు భరత్ పిడిఎస్యు జిల్లా నాయకులు లక్ష్మణ్, సతీష్, సాయి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం కేసీఆర్ ను కలిసిన అజిత్ జోగి తనయుడు

Bhavani

సామాజిక స్పృహ గల శిష్యులుంటే గురువుకెంతో ఆనందం

Satyam NEWS

ఎకో ప్రెండ్లీ సీడ్‌ గణేష్‌ కిట్టును ఆవిష్కరించిన ఉప్పల్‌ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment