31.2 C
Hyderabad
April 19, 2024 05: 36 AM
Slider ప్రకాశం

అధికార పార్టీకి స్థానిక అభ్యర్ధి కరవు

#Navataram Party

ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం లో స్థానిక అభ్యర్ధి దొరక్క ప్రక్కనే ఉన్న చీరాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ను ఇంఛార్జి గా నియమించే దయనీయ పరిస్థితి లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విమర్శించారు. అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 175 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం అని ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందని రావుసుబ్రహ్మణ్యం ఎద్దేవాచేశారు.

రానున్న ఎన్నికల్లో బాపట్ల జిల్లాలో నవతరంపార్టీ పదాధికారులు జాగ్రత్తగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని,ఆయన అభ్యర్థిని ఇంటికి పంపించాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.మార్టూరు పట్టణంలో నిర్వహించిన సమావేశానికి నియోజకవర్గ కన్వీనర్ కొవ్వూరి వెంకటరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్య అతిధులు గా జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షుడు నలమాల తిరుపతిరావు పాల్గొని నూతన నియామకాలు ప్రకటించారు.నూతనంగా మార్టూరు మండల అధ్యక్షుడు గా చెరుకూరి సుబ్బారావు, మార్టూరు మండల

ఉపాధ్యక్షుడు గా మల్లెల శ్రీకాంత్, డేగరమూడి గ్రామ అధ్యక్షుడు గా ఆమటి పుల్లారావు, రాజుపాలెం గ్రామ అధ్యక్షుడు గా జానపాటి వెంకటేశ్వర్లుని నియమించారు. వారికి నియామక పత్రాలను అందించారు.నవతరంపార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని రావుసుబ్రహ్మణ్యం కోరారు.

బాపట్ల జిల్లా అధ్యక్షుడు నలమాల తిరుపతిరావు మాట్లాడుతూ బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గాల్లో నవతరంపార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి సుకువెళ్తామన్నారు.కార్యక్రమంలో నవతరంపార్టీ నేతలు పదముత్తం శ్రీనివాసరావు, పల్లపు శ్రీనివాసరావు,కడియాల శ్రీనివాసరావు,కొమెర అంకమ్మ రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమరావతి రైతులకు భత్యాల చెంగలరాయుడు మద్దతు

Satyam NEWS

జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి పైన వెంటనే కేసు నమోదు చెయ్యాలి

Satyam NEWS

ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో రూ.5 కోట్ల బంగారం స్మగ్లింగ్

Satyam NEWS

Leave a Comment