30.7 C
Hyderabad
April 19, 2024 09: 15 AM
Slider నల్గొండ

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

#KantiVelam

కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు వైద్యాధికారులు మున్సిపల్ కమిషనర్లతో జరిగిన ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ మాట్లాడుతూ 2023 జనవరి 18 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని అందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. 10 సంవత్సరాల వయసు నిండిన వారి నుండి అందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో సుమారుగా 13 లక్షల 50 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని రూరల్ ప్రాంతంలో 9 లక్షల మంది ప్రజల కు కంటి పరీక్షలు నిర్వహించడానికి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లాలో మొత్తం 50 టీములను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆ రూరల్ ప్రాంతంలో 35 టీములు అర్బన్ మున్సిపాలిటీలలో 10 టీములను ఐదు టీములను స్టాండ్ బైగా ఉంచుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి డాక్టర్లు50 మంది, ఏ ఆర్ మిషనరీలు 50 ,లెన్స్ బాక్సులు 50, స్పైనల్ చార్ట్స్ 50, టార్చ్ లైట్స్ 50 ,ఆఫ్తామాలజిస్టు అసిస్టెంట్స్ 50 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 50 మంది, వాహనాలు 50, ఒక ప్రణాళిక బద్దంగా ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మున్సిపాలిటీలలో వార్డుల వారీగా కంటి వెలుగు శిబిరాలను నిర్వహించాలన్నారు.

వైద్యశాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్లు పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి హాజరవుతున్న వైద్య సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణాచలం మున్సిపల్ కమిషనర్లు సత్యనారాయణ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అశోక్ రెడ్డి శ్రీనివాస్ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వైసీపీ సానుభూతి పరుల లబ్ది కోసమే ఆన్ లైన్ విధానం….

Satyam NEWS

వైసీపీ కేంద్ర కార్యాలయం కాదు కుట్రలకు కేంద్రాలయం

Satyam NEWS

సీఎంపై అసభ్య పోస్టులు పెడితే ఆస్తులు అటాచ్ చేస్తాం

Satyam NEWS

Leave a Comment