28.2 C
Hyderabad
April 30, 2025 05: 32 AM
Slider కడప

చెయ్యేరు బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం……

అన్నమయ్య జిల్లా రాజంపేట చెయ్యేరు వరద ప్రాంతాల్లో జనసేన పి.ఏ.పి చైర్మన్ నాదెళ్ల మనోహర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనతో మందపల్లె,పులపుత్తూరు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు.స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి,ఎంపీ మిథున్ రెడ్డి పట్టించు కోలేదని వారు ఆరోపించారు.సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ బందోబస్తు మధ్య వచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చినా ఏడాది అయినా పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంత వరకు ఇండ్ల నిర్మాణం జరగలేదని,ఇచ్చిన నామమాత్రపు పరిహారం తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని ఆరోపణలు చేశారు.

కాగా నాదెళ్ల మనోహర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇంత విషాదం జరిగితే పట్టించుకోక పోవడం బాధాకర మన్నారు. ఈ ప్రభుత్వం వ్యవస్థ లను కుప్ప కూల్చారని,బాధితుల సమస్యలు వింటూ ఉంటే బాధ వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాధితులకు మూడు నెలలకు ఇళ్ళు కట్టి తాళాలు ఇస్తామని చెప్పి ఇంత వరకు పట్టించు కోలేదని ఆరోపించారు.ఇసుక మాఫియా,ఇసుక దోపిడీ చేసిన ప్రజా ప్రతినిధులు అడ్రస్ లేరని, సోషల్ మీడియాలో నిజాలు వెల్లడించిన వారిపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.ఈ రోజు తమ పర్యటన ఉందని తెలిసి ప్రభుత్వం లక్షా 40 వేలు బాధితుల ఖాతాల్లో వేస్తున్నట్టు హడావుడి గా ప్రకటన విడుదల చేశారని ఆరోపించారు.డిజిటల్ క్యాంపె యిన్ నిర్వహించమని యువతిని కోరాం.నిజాలు వెలుగులోకి తీసుకొచ్చి కలెక్టర్ ర్యాలయం వద్ద ధర్నా నిర్వహించి బాధితులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. బాధితుల సమస్యలను అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు పోయి న్యాయం చేసేలా పోరాడుతామని నాదెళ్ల మనోహర్ హామీ ఇచ్చారు.ఆయన వెంట జనసేన నేతలు అత్తికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నష్ట పోయిన రైతులకు పరిహారం అందిస్తాం

Satyam NEWS

విశాఖ ఉక్కును అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

రాహుల్ ‘జోడో’ యాత్ర రాజస్థాన్ రేఖ మార్చేనా?

mamatha

Leave a Comment

error: Content is protected !!