30.2 C
Hyderabad
April 27, 2025 19: 31 PM
Slider జాతీయం

కన్సొలేషన్:మేం తీసుకున్న చర్యలతో మంచి ఫలితాలు

nirmala

ఆర్ధిక మాంద్యం, పారిశ్రామిక మంద గమనంపై ప్రభుత్వం గత కొద్దినెలలుగా ప్రకటించిన చర్యలతో ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కార్పొరేట్‌ ట్యాక్సుల తగ్గింపు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సమీకరణ, నిలిచిపోయిన నిర్మాణ ప్రాజెక్టులకు ఊతం వంటి పలు చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ఆమె గుర్తుచేశారు.

ఆర్థిక అంశాలపై ప్రభుత్వం కసరత్తు మరింత వేగంగా కొనసాగిస్తున్నదని, పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. సోమవారం నుంచి బడ్జెట్‌ ముందస్తు సంప్రదింపులు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కార్పొరేట్లకు రూ 2.2 లక్షల కోట్లు, చిన్నమధ్యతరహా కంపెనీలకు రూ 72985 కోట్ల రుణాలు మంజూరు అయ్యాయని దీనివల్ల పరిశ్రమల రంగం కుదుటపడే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. రిటైల్ రుణాల జారీ కోసం ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలకు రూ 4.47 లక్షల కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

Related posts

నిన్న రుయా… నేడు కేజీహెచ్: అంబులెన్సు మాఫియా అరాచకాలు

Satyam NEWS

గోల్నాక జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఘనంగా బోనాల పండుగ

Satyam NEWS

దేవరశాంటా ఫ్రీ వెకేషన్ గిఫ్ట్ ఇవ్వనున్న హీరో విజయ్ దేవరకొండ

mamatha

Leave a Comment

error: Content is protected !!