బిక్షాటన పేరుతో ఉన్నవారి ని చూసి మీరు జాలి పడుతున్నారా..? చంకలో బిడ్డ నెత్తుకుని ఉన్న తల్లిని చూసి మీరు కరిగిపోయారా..? అయితే అక్కడితో ఆగిపోండి అని అంటున్నారు విజయనగరం జిల్లా పోలీస్ బాస్ వకుల్ జిందల్. ఇలానే టాటానగర్ కు చెందిన భార్యాభర్తలు తమ చిన్నారిని అడ్డు పెట్టుకుని రాష్ట్ర మంతటా నేరాలకు పాల్పడి విజయనగరంలో అడుగు పెట్టారని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాళీఘాట్ కాలనీలో ఓ ఇంట్లో ఈ ఇద్దరిలో మహిళ తన బిడ్డ ను చంకనెత్తుకుని సాయం కోసం ఇంట్లోకి వెళ్లి…ఆ ఇంటినే గుల్ల చేసిందని అన్నారు డీపీఓలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్,వన్ టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మీ ప్రసన్నకుమార్ లతో కలిసి ఎస్పీ వకుల్ జిందల్ ఈ విషయాన్ని చెప్పారు. ఫిర్యాదు అందిన వెంటనే వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ టాటానగర్ వెళ్లి విచారణ చేసారని, భార్యాభర్తలిద్దరూ పక్కా ప్లాన్ తో ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడే వారని ఎస్పీ వకుల్ తెలిపారు. మనకు వచ్చిన మన సిబ్బందికి పట్టబడటంతో వివరాలు సేకరించి..ఆధరాలతో నిందితులైన భార్యాభర్తలిద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు.
previous post