39.2 C
Hyderabad
April 23, 2024 16: 28 PM
Slider ప్రత్యేకం

హైదరాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం పై వ్యాసాలకు ఆహ్వానం

#telanganasaraswataparishad

తెలంగాణ సారస్వత పరిషత్తు రాష్ట్రంలోని 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి మొదలైన అంశాలపై చేపట్టిన పథకంలో హైదరాబాద్ జిల్లాకు సంబంధించి పరిశోధకుల నుంచి వ్యాసాలు ఆహ్వానిస్తోంది.

తెలంగాణ ఇతర జిల్లాలతో పోలిస్తే రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న విశేషాలు ప్రత్యేకత కలిగనవి కావడం వల్ల ఇక్కడి చారిత్రక, సంస్కృతి, సాహిత్యం, కళలు, మత సామరస్యం వంటి  అంశాల గురించిన పరిశోధనాత్మక సమాచార సమీకరణకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

తెలుగు కవులు, రచయితలు ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రత్యేకతల పై పరిశోధన చేసిన వారు వ్యాసాలు అందించాలని పరిషత్ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య ఒక ప్రకటనలో కోరారు.

శతాబ్దాల హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, పురావస్తు కట్టడాలు, కుతుబ్షాహీలు, అసఫ్ జాహీలు నిర్మించిన కోటలు, జలాశయాలు, మ్యూజియాలు,పార్కులు, రైల్వే స్టేషన్లు, గ్రంథాలయాలు, సమాధులు,ఇక్కడి విశిష్టమైన పండుగలు మొదలైన అనేక ప్రత్యేకతలు పై వ్యాసాలు రాసేవారు వివరాలకు వేముల నారాయణ ( 9490093219), కె.హరనాథ్ (97035 42598), ఎస్వీ విజయభాస్కర్(9290826988), శ్రీనాథ్ (8331025482)లను సంప్రదించాలని వారు కోరారు.

వ్యాసాలన్నీ కూర్చి’ హైదరాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం’ అనే పుస్తకాన్ని త్వరలోనే ప్రచురించనున్నట్టు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వ్యాసరచన, సంకలనం చేయడం వంటి పనులు జరుగుతున్నాయని అన్నారు.

Related posts

జూన్ 26వ తేదీ వరకు వేసవి సెలవుల పొడిగింపు

Bhavani

విలేకరుల ప్లాట్ల డిప్పులో గందరగోళం

Satyam NEWS

సత్యం న్యూస్ చెప్పినట్టు.. ఉత్తరాంధ్ర లో కమ్మేసిన కారు మబ్బులు…!

Satyam NEWS

Leave a Comment