21.2 C
Hyderabad
December 11, 2024 21: 18 PM
Slider ముఖ్యంశాలు సినిమా

సైరా చిత్రం బిజినెస్ ఉత్సాహంగా లేదా?

syeraa-movie

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా బిజినెస్ ఎలా అవుతున్నది? దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగడంలేదని తెలిసింది. ట్రేడ్ లెక్కల ప్రకారం ప్రి రిలీజ్ బిజినెస్ రూ.300 కోట్లు దాటితేనే బ్లాక్ బస్టర్ అవుతుంది. రూ.240 కోట్లు దాటితే సూపర్ హిట్ అవుతుంది. రూ.200 కోట్లు దాటితేనే హిట్ అంటారు. అయితే సైరా బిజినెస్ ఇప్పటికి రూ.197 కోట్ల వరకూ అయినట్లు అంచనా వేస్తున్నారు. ఇది ధియేట్రికల్ ఆదాయం కాగా నాన్ ధియేట్రికల్ ఆదాయం కూడా ఉంటుంది. నాన్ ధియేట్రికల్ ఆదాయం సైరా చిత్రానికి సుమారుగా రూ.125 కోట్లు రావచ్చునని అంచనా వేస్తున్నారు. అంత రావచ్చు లేదా రాకపోవచ్చు. ఆశించిన మేరకు ఆదాయం వస్తే సైరా చిత్రం నిర్మాతలు నష్టాలు లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. ఒక తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో బిజినెస్ చేయడం అంత తేలికైన విషయం కాదు కానీ ప్రస్తుతం మారిన పరిస్థితులు నేపథ్యంలో మహేష్ బాబు, ప్రభాస్ సినిమాలు వంద కోట్ల మార్కు దాటుతున్నందున సైరా చిత్రం మరింత ఎక్కువగా బిజినెస్ చేయాల్సి ఉంది. అయితే అంత ప్రభావం కనిపించడం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. థియేట్రికల్ బిజినెస్ లెక్కలే సినిమా హిట్టా కాదా అనే విషయాన్ని నిర్ధారిస్తాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ కేవలం నిర్మాతలకు ఆదాయమే తప్ప దానితో హిట్ సినిమాలను నిర్ధారించరు.

Related posts

తాళంవేత అనంతరం

Satyam NEWS

చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి పాదయాత్రల కిక్కు

Satyam NEWS

జేఏసీ రిక్వెస్ట్: బంద్ కు సహకరించండి

Satyam NEWS

Leave a Comment