27.7 C
Hyderabad
April 25, 2024 07: 35 AM
Slider విజయనగరం

విజయనగరంలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు

#vijayanagarampolice

విజయనగరం జిల్లా పూసపాటిరేగ, చీపురుపల్లి పోలీసు స్టేషన్ల పరిధిలో రాత్రిపూట ఇళ్ళల్లోకి చొరబడి నిద్రిస్తున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను చోరీలకు పాల్పడుతున్న అదపాక  కి చెందిన పాత నేరస్తుడుని విజయనగరం సీసీఎస్, పూసపాటిరేగ మరియు చీపురుపల్లి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసి, అతని వద్ద నుండి 9 ¼ తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసారు.

ఈ మేరకు విజయనగరం సీసీఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయనగరం డిఎస్పీ అనిల్ మాట్లాడారు. వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం జిల్లా పూసపాటి రేగ పోలీసు స్టేషన్ పరిధిలో గత సంవత్సరం జి. అగ్రహారం గ్రామంలో ఇంటి ముందు నిద్రిస్తున్న ఒక మహిళ మెడలో తులంన్నర బంగారు గొలుసును, కుమిలి లో ఒక ఇంటిలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 6 1/4 తులాల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించుకొని పోయారు.

అదే విధంగా.. ఈ సంవత్సరం చీపురుపల్లి మండలం గొల్లల పేట గ్రామంలో రాత్రిపూట ఇంటి బయట నిద్రిస్తున్న ఒకామె మెడలో బంగారు త్రాడును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకు పోయారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పూసపాటిరేగ, చీపురుపల్లి పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఇటీవల చీపురుపల్లి పిఎస్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఈ కేసుల గురించి, ఆరా తీసి, వీటిని వెంటనే చేధించాల్సిందిగా సిసిఎస్ పోలీసులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో సీసీఎస్, చీపురుపల్లి, పూసపాటిరేగ పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి, నిందితుల గురించి గాలింపు చేసి, ఈ తరహా నేరాలకు పాల్పడిన పాత నేరస్థులపై నిఘా పెట్టారు.

ఈ బృందాలకు రాబడిన సమాచారం పై పూసపాటిరేగ మండలం కందివలస జంక్షను వద్ద అనుమానస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, సదరు వ్యక్తి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం, అదపాక కి చెందిన కుప్పిలి వెంకటరమణ అలియాస్ రాంబాబు అని తెలిపాడు.

అనుమానంతో పోలీసులు అతని గురించి మరింత లోతుగా విచారించగా కుప్పిలి వెంకట రమణ, అతని బావ నాగరాజు మరియు ముత్తయ్యలు ఒక బృందంగా ఏర్పడి, విజయనగరం జిల్లాలో చీపురుపల్లి మండలం గొల్లలపేట, పూసపాటిరేగ మండలం కుమిలి, జి.అగ్రహారంలో దొంగతనాలకు పాల్పడినట్లుగా అంగీకరించాడు.

తాజాగా కూడా పూసపాటిరేగ మండలంలో చోరీ చేసేందుకు కందివలస వచ్చి, మిగిలిన ఇద్దరు గురించి వేచి వుండగా, పట్టుబడినట్లుగా  డీఎస్పీ తెలిపారు.  ఈ కేసుల్లో మిగిలిన ఇద్దరు నిందితులను కూడా పట్టుకొనేందుకు నిఘా పెట్టినట్లుగా ఆయన తెలిపారు. అరెస్టు అయిన  నిందితుడి పై గతంలో చీపురుపల్లి, పూసపాటిరేగ, నెల్లిమర్ల, గరివిడి, పొందూరు, లావేరు, శ్రీకాకుళం పోలీసు స్టేషన్ లో 15 కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

దొంగతనాలు జరగకుండా ఉండేందుకు పోలీసుశాఖ లార్డ్ హౌస్ మోనటరింగు సిస్టంను గతంలోనే ప్రవేశ పెట్టిందని, ఎవరైనా ఇల్లు విడిచి వేరే ప్రాంతాలకు వెళ్ళినపుడు సంబంధిత పోలీసు స్టేషనుకు ముందుగా సమాచారం అందిస్తే, సదరు ఇంటిలో దొంగతనాలు జరగకుండా ఎల్.హెచ్.ఎం.ఎస్.ను ఉచితంగా ఏర్పాటు చేసి, నిఘా ఏర్పాటు చేస్తుందని, ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజయనగరం డిఎస్పీ అనిల్ విజ్ఞప్తి చేసారు.

పూసపాటిరేగ, చీపురుపల్లి పీఎస్ లో నమోదైన మూడు కేసులను చేధించి, నిందితుడి వద్ద నుండి 9 .1/4 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో క్రియాశీలకంగా పని చేసిన విజయనగరం సీసీఎస్ సిఐలు ఎస్.కాంతారావు, సి. హెచ్.శ్రీనివాసరావు, పూపాటిరేగ ఎస్ఎ జయంతి, చీపురుపల్లి ఎస్ఐ సన్యాసినాయుడు, సీసీఎస్ ఎఎస్ఐ గౌరీశంకర్, హెచ్ సిలు టివిఆర్ వి ప్రసాద్, ఎస్.వి.రమణమూర్తి, కానిస్టేబుళ్ళు టి.శ్రీనివాస్, బి. రాంబాబు, డి. దామోదరరావులను విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక, విజయనగరం డీఎస్పీ అనిల్  ప్రత్యేకంగా అభినందించారు.

Related posts

వేగంగా వ్యాక్సినేషన్ చేస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు

Satyam NEWS

పాక్ లో ఆర్ధిక సంక్షోభం: ప్రత్యర్థుల అరెస్టుల్లో పాలకులు బిజీ

Satyam NEWS

ఉపాధి హామీ పథకం బకాయిలను వెంటనే చెల్లించాలి

Satyam NEWS

Leave a Comment