25.2 C
Hyderabad
January 21, 2025 10: 37 AM
Slider నల్గొండ

కోదాడలో నిలువుదోపిడి చేసిన దొంగలకు దేహశుద్ధి

#kodada

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో దొంగలు హల్ చల్ చేసి పట్టపగలే నిలువు దోపిడీ చేశారు. వడ్ల వ్యాపారి నుండి నగదు దొంగలించి ఇద్దరు వ్యక్తులు పరారు కావడంతో కొందరు వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఒక వ్యాపారి నుండి డెబ్బై వేల రూపాయలు నగదు,బంగారం చోరీ చేసి పరారైతున్న ఇద్దరు వ్యక్తులను శ్రీరంగాపురం యువకులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఒకరు పరారీ కాగా మరొక యువకుడికి దేహశుద్ధి చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన మరొక వ్యక్తికై గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts

తిరుమలలో పురాతన కట్టడాల కూల్చివేతపై ప్రధాని జోక్యం చేసుకోవాలి

Satyam NEWS

బేషరతుగా వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే

Satyam NEWS

రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారులపై అక్రమ చలాన్ల వసూలు నిలిపివేయాలి

Satyam NEWS

Leave a Comment