31.7 C
Hyderabad
April 24, 2024 23: 14 PM
Slider జాతీయం

మీరు ఈయనకన్నా బలవంతులా? ఒక్క సారి ఆలోచించండి

#jagadishLad

మేం చాలా బలంగా ఉన్నాం మాకు కరోనా రాదు అనుకుంటుంటారు కొందరు. మాకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది ఎప్పుడూ జలుబు కూడా చేయలేదు… అందువల్ల మాకు కరోనా రాదు అని అంటుంటారు మరి కొందరు.

బిపి, షుగర్ లాంటి రుగ్మతలు ఉన్న వారు చచ్చిపోతాము మాకేం కాదు అని చాలా మంది అనుకుంటుంటారు.

కనీసం మూతికి మాస్క్ కూడా పెట్టుకోరు. ఎవరైనా మాస్క్ పెట్టుకోమని చెబితే కోపం కూడా వస్తుంది.

పైన ఫొటో చూశారు కదా. ఆయన పేరు జగదీష్ లాడ్. ఆయన ఒక ప్రముఖ బాడీ బిల్డర్. ఆయన మిస్టర్ ఇండియా టైటిల్ పోరులో రజత పతకం గెలుచుకున్నారు.

దేశీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించారు. శరీర దారుఢ్యంలో జగదీష్ లాడ్ కు సాటి ఎవరూ లేరు.

ఆయన మహారాష్ట్ర కు చెందిన వారైనా గుజరాత్ లోని వడోదరాలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఎంతో జాగ్రత్తగా ఉన్నా జగదీష్ లాడ్ కు కరోనా సోకింది.

దాంతో ఆయన ను ఆసుపత్రిలో చేర్చారు. శ్వాస అందకపోతే ఆయనకు వెంటిలేటర్ అమర్చి ఆక్సిజన్ అందించారు.

నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి అలసి పోయారు. నాలుగు రోజుల కిందట ఆయన తుది శ్వాస తీసుకున్నారు.

బాడీ బిల్డర్ జగదీష్ కన్నా ఎవరికి శరీర దారుఢ్యం ఉండదు కదా? ఆయనే కరోనాతో మరణించారు.

అందుకే మూతికి ముక్కుకు మాస్క్ పెట్టుకోండి, భౌతిక దూరం పాటించండి, అవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దు. సినిమాలు, బార్లు అంటూ చెడుతిరుగుళ్లు తిరగవద్దు… కరోనాతో తస్మాత్ జాగ్రత్త.

Related posts

ముదిరాజులను అణచివేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

“తిరుపతి జిల్లా” గా పేరు మార్చాలి

Satyam NEWS

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో నెం1 తెలంగాణ

Satyam NEWS

Leave a Comment