39.2 C
Hyderabad
March 29, 2024 14: 46 PM
Slider సంపాదకీయం

వికృత కామెంట్లతో ఆర్ధిక లాభం?

#ramgopalvarma

పైశాచిక ప్రవృత్తి ఉన్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య తరచూ తన వికృత మనస్తత్వాన్ని బయటపెడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్స కలిగించేవిగా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై ఆయన చేసే వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకంగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఒక రాజకీయ పార్టీని స్థాపించి తాను అనుకున్న ఆశయం కోసం పని చేస్తున్నారు.

తన ప్రయత్నంలో సఫలం కావచ్చు కాకపోవచ్చు. మొదటి ప్రయత్నంలో ఆయన విఫలం అయ్యారు. ఆ విషయం ఆయనే చెప్పుకుంటుంటారు. తొలి ప్రయత్నంలో విఫలం అయినా కూడా పవన్ కల్యాణ్ అడుగుతీసి అడుగేస్తే లక్షలాది మంది యువకులు కదలి వస్తున్నారు. ఆయన మాటలకు స్పందిస్తున్నారు. ఆయన నడిపేది ఒక రాజకీయ పార్టీ కాబట్టి ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి.

ఆయన వ్యూహాలను ఆమోదించిన వారు ఆ పార్టీలో ఉంటారు. లేనివారు వెళ్లిపోతారు. పవన్ కల్యాణ్ వేసే రాజకీయ ఎత్తుగడలు ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నచ్చితే సరిపోతుంది కానీ రామ్ గోపాల్ వర్మకు నచ్చాల్సిన అవసరమే లేదు. గతంలో ఇలానే కాపు కులస్తులకు పవన్ కల్యాణ్ అన్యాయం చేశారని చెబుతూ రామ్ గోపాల్ వర్మ అతి దారుణమైన కామెంట్ పెట్టారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పొత్తులపై ఒక స్పష్టత ఇచ్చేందుకు, తన పార్టీ కార్యకర్తల్ని సన్నద్ధం చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులపై మాట్లాడటం లేదా తాను తీసుకోబోయే నిర్ణయాల గురించి మాట్లాడుకోవడం ఆయనకు ఉన్న సంపూర్ణ హక్కు. ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మకు సంబంధమే లేదు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలుస్తాయో లేదో ఇప్పటికీ స్పష్టత లేదు.

ఆ మూడు పార్టీలూ కలిసి పోటీ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారనేది కూడా వాస్తవం. బీజేపీకి తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడంపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయాలని కూడా మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ మూడు పార్టీలు లేదా ఆ రెండు పార్టీలు కలవడం అధికార వైసీపీకి మాత్రమే ఇష్టం లేదు.

అందుకే వైసీపీ నాయకులు తరచూ ‘దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి’ అంటూ వ్యాఖ్యానిస్తుంటారు. జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకుంటే తమ అస్థిత్వానికి ముప్పు వాటిల్లుతుంది కాబట్టి వైసీపీ నాయకులు ఈ పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒక అర్ధం ఉంది. రామ్ గోపాల్ వర్మకు ఆ విషయం ఎందుకు?

రాజకీయ వ్యాఖ్యలు ఎవరైనా చేయవచ్చు అని అనుకున్నా ధర్డ్ గ్రేడ్ కామెంట్లు చేయడం రామ్ గోపాల్ వర్మ లాంటి సినీ దర్శకుడికి అవసరమా? ఎన్నికల సమయానికి రాజకీయ సినిమాల పేరుతో తన ఊహలకు అనుగుణమైన సినిమాలు తీయడం, వాటిని ప్రజలపైకి వదలడం రామ్ గోపాల్ వర్మకు అలవాటు.

గతంలో చాలా సార్లు ఇలానే చేసిన ఆయన ఈ సారి వైసీపీ తరపున మూడు సినిమాలు ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ మూడు సినిమాలకు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారని కూడా అంటున్నారు. ఆ ఖర్చు అంతా వైసీపీనే భరిస్తుందని కూడా రాజకీయ నాయకులలో చర్చ జరుగుతున్నది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమా తీయడం అంటే రామ్ గోపాల్ వర్మకు అందులో ఎంతో లాభం ఉంటుంది.

వికృత రాజకీయ సినిమాలు తీసి లాభాలు మూటగట్టుకోవాలని చూస్తున్న రామ్ గోపాల్ వర్మ, అధికార పార్టీ దృష్టిలో అనునిత్యం ఉంటూ వారి ప్రాపకం సంపాదించడానికి కులాలపై వ్యాఖ్యానాలు చేయడం క్షమించరాని విషయం. కమ్మ, కాపు కులస్తులు కలవకుండా చేయడానికి ఆయన తన వ్యాఖ్యల ద్వారా ఎంతో శ్రమపడుతుంటారు. రామ్ గోపాల్ వర్మ లాంటి వికృత మనస్తత్వం ఉన్న వ్యక్తులు చెప్పడం వల్ల రాజకీయాలు మారవు.

రాజకీయాలను ప్రభావితం చేయాలనే వ్యర్ధ ప్రయత్నాలు మానుకుంటే ఇప్పటికైనా రామ్ గోపాల్ వర్మకు సినీ దర్శకుడిగా కొద్దిగానైనా గౌరవం మిగులుతుంది. అమ్మాయిల కాళ్లు నాకడం, కామం ప్రకోపించే సినిమాలు తీయడం, హత్యలు ఇతర నేరాలను ప్రమోట్ చేస్తూ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన రామ్ గోపాల్ వర్మను ఇప్పటికే సమాజం ఛీదరించుకుంటున్నది. ఇప్పటికి దిగజారింది చాలు వర్మా ఇంకా అథ:పాతాళానికి వెళ్లవద్దు.

Related posts

కాకతీయ యూనివర్సిటీలో స్పోర్ట్స్ డైరెక్టర్ దురుసు ప్రవర్తన

Satyam NEWS

ప్రత్యేక హోదా లేనే లేదు

Murali Krishna

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మహిళల ప్రదర్శన

Satyam NEWS

Leave a Comment