25.2 C
Hyderabad
January 21, 2025 11: 16 AM
Slider పశ్చిమగోదావరి

నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ డివిజనల్ అధికారి

#filephoto

ఏలూరు జిల్లా  లో ఆయనొక డివిజనల్ స్థాయి అధికారి విధుల పట్ల అత్యంత బాధ్యతారహితం గాను, ఉన్నత అధికారుల  కారుల ఎమర్జెన్సీ ఆదేశాలను తుంగలో తొక్కి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనీస ప్రోటోకాల్ నిబంధనలకు నిలువునా పాతరేసి విధులకు గైర్హాజరయ్యే వ్యక్తి. ఇందుకు సంబంధించి కొంత మంది ఉద్యోగుల సమాచారం ప్రకారం 2024 సెప్టెంబర్ 1 వ తేదీ నుండి 3 వ తేదీ వరకు తూఫాన్ ఏర్పడి భారీ వర్షాల తో ఏజెన్సీ జన జీవనం అతలాకుతలమై పోతుందని జిల్లా అధికారులు జిల్లా కేంద్రమైన ఏలూరు లో విధులు నిర్వహించే అధికారులందరికి ఏజెన్సీ లో అత్యవసర సేవలు అందించేందుకు ఫ్లడ్ డ్యూటీలు వేశారు.

ఆ డ్యూటీ కి ఈ అధికారిని కూడా జిల్లా అధికారులు ఆదేశించారని సమాచారం,జిల్లా ఉన్నత అధికారుల  ఆదేశాల ప్రకారం అందరు అధికారులు తమ కుటుంబాలను విడిచి ఏజెన్సీ లో వరదపీడిత గ్రామాలలో సేవలందిస్తున్నారు. ఈ అధికారి మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి ఎన్ టి ఆర్ జిల్లాలో తన స్వగ్రామానికి వెళ్లి ఎవరేమైపోయినా నాకెందుకు అన్నట్టుగా దుప్పటి తన్నిపట్టుకుని పడుకుని విశ్రాంతి తీసుకున్నాడని ఆ శాఖ ఉద్యోగులే చెప్పుకున్నారు. సదరు అధికారి వ్యవహారం తెలుసుకున్న జిల్లా ఉన్నత అది కారులు ఈ అధికారికి చార్జీ మేమో ఇచ్చి ఏలూరు జిల్లా నుండి మాన్యం జిల్లాకు బదిలీ చేసినట్టు తెలిసింది.

జిల్లా అధికారులు తనను నిబంధనలకు విరుద్ధం గా బది లీ చేశారని కోర్టు ను ఆశ్రయించి ఎక్కడ నుండి బదిలీ అయ్యారో మళ్ళీ అక్కడికే కోర్టు ఆదేశాలతో ఏలూరు  బదిలీ పై  వచ్చి జిల్లా ఉన్నతాదికారి అనుమతి లేకుండా విధులు నిర్వహిస్తు జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద తల నొప్పిగా మారాడని సమాచారం. ఈ అధికారి పై ఈ జిల్లాతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఎన్నో అవినీతి ఆరోపణలు,మరెన్నో విజిలెన్స్ విచారణలు ఉన్నాయి. ఈయన తన  ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకుని  అక్రమ లే ఔట్ లకు అనుమతులిచ్చి అక్రమార్గాన కోటాను కోట్ల రూపాయలు ముడుపులు పొందినట్టు రాష్ట్ర స్థాయి లో విచారణలు, విమర్శలు ఎదుర్కుంటున్నట్టు సమాచారం.

విచిత్రం ఏమిటంటే ఈయన ది ప్రాథమిక పాఠశాల విద్యార్హత పూర్తి చేసి 10 వ తరగతి ఫెయిల్ అయ్యి ఉద్యోగం లో కొనసాగాడని తెలిసింది. ఉద్యోగ రీత్యా ప్రభుత్వం విద్యార్హతలు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ లో బాబుగారు 10 ఫెయిల్ అయినట్టు గుర్తించారని విశ్వసనీయ సమాచారం. ఈయన విద్యార్హతలు చూసి ఖంగు తిన్న వెరిఫికేషన్ అధికారులు 10 వ తరగతి,ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలని ఆదేశించినట్టు సమాచారం. దీనితో ఉద్యోగం నిలా బెట్టు కోవాలంటే డిగ్రీ  చదివినట్టు దొడ్డి దారిలో విద్యా మార్కెట్ లో అమ్మే సర్టిఫికెట్ ఒక నకిలీ సర్టిఫికెట్  సంపాదించి దానిని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ కళ్ళు గప్పి కాలయాపన చేస్తున్నట్టు సమాచారం.

పదవ తరగతి విద్యార్హత  కూడా లేని ఈ అధికారి తూర్పు గోదావరి జిల్లాలో కొన్నాళ్ళు ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారిగా ప్రభుత్వం  బాధ్యతలు అప్పగించి కొన సాగించినట్టు విశ్వసనీయ సమాచారం,ఈ అధికారి కి కనీస 10 వ తరగతి విద్యార్హతలు లేవనే సమాచారం ఏ పీ రాజధాని అమరావతి లో సంబంధిత శాఖ లో వెలుగు చూడటం తో బాబు గారి బండారం బయట పడిందని ఆ శాఖ ఉద్యోగులు కథలు కథలుగా చెప్పుకున్నారు.

ఈ వ్యవహారం పై జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులను ఆ అధికారి 10 వ తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ల కు సంబంధించి  సర్టిఫికెట్స్ నకళ్ల కాపీలను సమాచార హక్కు చట్టం ద్వారా కోరి నెల లు గడచి పోతున్నా ఆ ఉద్యోగి కి సంబంధించిన విద్యార్హతలు సర్టిఫికెట్స్ నకళ్ల రూపం లో అందించ లేక తూర్పు,పశ్చిమ కృష్ణ జిల్లా ల అధికారులు లేని విద్యార్హత ల సర్టిఫికెట్స్ మూడు జిల్లాల కార్యాలయాల్లో ఆయన సర్వీస్ రికార్డు అంతా కుళ్లగిస్తున్నట్టు సమాచారం. అసలు సర్టిఫికెట్స్ లేనప్పుడు అధికారులు ఎంత వెదికినా ఎందుకు దొరుకుతాయని ఆ శాఖ ఉద్యోగులు విమర్శించుకుంటున్నారు.

ప్రాథమిక విద్యార్హతలు లేకుండా మార్కెట్ లో అక్రమ మార్గాన కొనుగోలు చేసిన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ ఒకటి చూపి యావత్ ప్రభుత్వాన్ని మోసాగిస్తూ తప్పు దోవ పట్టిస్తూ  మూడు జిల్లాల అధికారులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తు ముప్ప తిప్పలు పెడుతున్న ట్టు చెప్పుకుంటున్న ఆ డివిజనల్ స్థాయి అధికారి పై  ఆ శాఖ ఉన్నాధికారులు శాఖా పరమైన చర్యలు తీసుకోక పోవడం వెనుక పలు అనుమానాలు కూడా ఆ శాఖలో  కొంత మంది సిబ్బంది వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

Related posts

సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ కుమార్ అనారోగ్యంతో మృతి

Satyam NEWS

నెల్లూరు క్రిస్మస్ వేడుకల్లో మంత్రి అనిల్

Satyam NEWS

తిరుమల ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు

Satyam NEWS

Leave a Comment