30.7 C
Hyderabad
April 19, 2024 10: 29 AM
Slider ప్రత్యేకం

ఈ సమస్య ఈనాటిది కాదు..30 ఏళ్ల కిందటే…

30 years modi

ఈ ఫొటో దాదాపు 30 సంవత్సరాల కిందటిది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ. ఆ సమయంలో పాకిస్తాన్ లో మత హింసకు బలి అయి ప్రాణాలు అరచేత పట్టుకుని భారత్ వలస వచ్చిన కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్న ఫొటో ఇది. మత హింస బాధితుల విషయంలో ఆయనకు ఆ నాటి నుంచే ఒక అవగాహన ఉన్నది.

 పాకిస్తాన్ లేదా మరే ఇతర ముస్లిం దేశం నుంచి అయినా సరే మత హింసకు గురైన వారిని ఏ విధంగా కాపాడాలనేది ఈ నాడు ఆయన తీసుకున్న నిర్ణయం కాదు. అప్పటి నుంచే ఆయన మదిలో ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. అంతే కాకుండా ఇతర దేశాల నుంచి మతహింస కారణంగా బలి అయి మన దేశానికి వలస వస్తున్న వారికి భారత పౌర సత్వం ఇవ్వాలనే డిమాండ్ చాలా సంవత్సరాల నుంచే మన దేశంలో వినిపిస్తూ వస్తున్నది.

భారత కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా మత హింస కు గురైన వారికి భారత పౌర సత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండో సారి ప్రధాని అయిన నరేంద్ర మోడీ పౌర సత్వ చట్టాన్ని సవరించారు. అప్పుడు ఇదే డిమాండ్ చేసి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్న వారు సమాధానం చెప్పుకోవాలి తప్ప సమాధానం చెప్పాల్సింది బిజెపి కాదు.

రఘురామ్ మాగంటి

Related posts

సి ఐ టి యు జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలి

Satyam NEWS

రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధిస్తుంది.

Murali Krishna

రాపిడ్ టెస్టు కిట్లకు వెంకయ్య సర్టిఫికెట్

Satyam NEWS

Leave a Comment