38.2 C
Hyderabad
April 25, 2024 11: 22 AM
Slider శ్రీకాకుళం

ఈ స్కూల్ ను కాపాడకపోతే ప్రభుత్వమే వేస్టు

Amudalavalas

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పడిపోవడం సర్వసాధారణ విషయం. విద్యార్ధులను ఆకర్షించేందుకు మధ్యాహ్న భోజన పథకం లాంటి స్కీమ్ లు కూడా పెట్టి సాధ్యమైనంత వరకూ డ్రాప్ అవుట్ కాకుండా చూస్తున్నారు. అయితే ఇక్కడో స్కూలుంది. అదీ ప్రభుత్వ పాఠశాలే. అయితే అక్కడ ప్రతి ఏటా చదువుకునే పిల్లలు పెరుగుతున్నారు. నమ్మడం లేదా?

మీరే కాదు చాలా మంది నమ్మరు కానీ ఇది నిజం. అది ఆముదాల వలసలోని లక్ష్మి నగర్ స్కూల్. ఈ స్కూల్ లో 9, 10 తరగతులు చదవాలంటే అడ్మిషన్ టెస్టు ఉంటుంది. ఆ టెస్టును క్లియర్ చేస్తేనే 9, 10 తరగతలు చదివే వీలుంటుంది. ఇక్కడ ఏ ప్రభుత్వం పెట్టిందో తెలియదు కానీ ఇంగ్లీష్ మీడియం చాలా కాలంగా ఉంది.

గత ఏడేళ్ల నుంచి ఈ స్కూల్ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నది. గత ఏడాది వెయ్యి మంది విద్యార్ధులు ఈ స్కూల్లో చదివారు. ఇప్పుడు ఎంత మంది ఉన్నారో తెలుసా? కనీసం మనం ఊహించను కూడా ఊహించలేం. ఇప్పుడు ఆ స్కూల్ లో విద్యార్ధుల సంఖ్య 1800 పైమాటే. ఆశ్చర్యం కలిగించే ఫలితాలు సాధిస్తున్న ఈ స్కూల్ కు కూడా ప్రభుత్వం దరిద్రాన్ని అంటిస్తున్నది.

ఈ మునిసిపాలిటీ స్కూల్ మురికి కూపంలాగానే ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కూలుకు ఉన్న భవనం అతి పురాతనమైనది. దీనికి ఆలనా పాలనా లేదు. మరమ్మతులు చేసే దిక్కులేదు. విద్యార్ధుల సంఖ్య పెరుగుతున్నా అదనపు గదులు నిర్మించే ఔదార్యం లేదు. ఉన్నవాటినే పాడుపెడుతుంటే ఇక కొత్త గదులు కట్టించడం ఎవడు చేస్తాడు?

 గత ఏడేళ్ల నుంచి ప్రయివేటు స్కూళ్ల తో పోటీ పడుతున్న ఈ మునిసిపాలిటీ హైస్కూల్ కు పట్టణం నడి మధ్యలో ఉండటం వల్ల అదనపు గదులు కట్టే అవకాశం లేదు. ఏదో ఒకటి చేయాలి.

చేసి ఈ సరస్వతీ నిలయాన్ని కాపాడాలి. నాడు నేడు లాంటి పథకాలు ఈ స్కూలుకు వర్తిస్తాయా? ప్రభుత్వం ఈ స్కూల్ ను అభివృద్ధి పరుస్తుందా? ఈ స్కూల్ ను కాపాడకపోతే ప్రభుత్వ యంత్రాంగమే వేస్టు.

Related posts

పేదింట్లో కల్యాణలక్ష్మి కాంతులు తెలంగాణ ప్రత్యేకం

Satyam NEWS

సహకార అవినీతిపై 19న వనపర్తిలో బిజెపి ధర్నా

Bhavani

108 లో ప్రసవం.. తల్లి బిడ్డలు క్షేమం

Satyam NEWS

Leave a Comment