వాడికి తలపై కొమ్ములొచ్చాయి రా అంటూ ఉంటాం ఎవరైనా పొగరుగా ప్రవర్తిస్తే. పాపం అదేమిటో గానీ మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలోని రహి గ్రామానికి చెందిన శ్యామ్ లాల్ యాదవ్ అనే వ్యక్తికి నిజంగానే కొమ్ములొచ్చేశాయి. కొన్నేళ్ల కిందట అతని తలకు దెబ్బ తగిలింది. గాయం తగ్గినప్పటికీ తలపై కొమ్ము లాంటి ఆకారం పెరిగింది. మొదట్లో ఈ విషయాన్ని తేలికగా తీసుకున్న అతను ఇంట్లో తనకు తానే దానిని కత్తిరించడం ప్రారంభించాడు. రోజురోజుకీ దాని ఆకారం పెరుగుతుండటంతో చివరకు డాక్టర్లను ఆశ్రయించాడు. శ్యామ్‌లాల్ ను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేసి, కొమ్ము వంటి భాగాన్ని తీసేశారు. దీనిపై డాక్టర్లు మాట్లాడుతూ శ్యామ్‌లాల్ డెవిల్స్ హార్న్‌గా పిలువబడే సబాకస్ హార్న్‌తో బాధపడ్డాడని చెప్పారు. ఈ వ్యాధిలో సూర్యుడికి ఎక్సపోజ్ అయ్యే చర్మభాగంలో ఒక్కోసారి ఇలా చర్మం పొడుచుకు అవుతుందన్నారు. కొమ్ము వంటి భాగం మూలాలో లోతుగా లేకపోవడంతో సులభంగా తొలగించామని తెలిపారు. ఇలాంటి అరుదైన కేసు గురించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితం చేయాల్సిందిగా ప్రతిపాదనలు పంపామని వైద్యులు పేర్కొన్నారు.
previous post
next post