22.2 C
Hyderabad
December 10, 2024 11: 03 AM
Slider జాతీయం

యూపీ సీఎం యోగికి బెదిరింపు కాల్స్

#yogiadityanath

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు దుండగులు మెసేజ్ పంపడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 10 రోజుల్లోగా యోగి రాజీనామా చేయాలి.. చేయకుంటే మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని చంపినట్లే యోగిని హతం చేస్తామని మెసేజ్ పంపారు. మెసేజ్ ఎవరు పంపారో తెలుసుకోవడానికి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత బాబా సిద్ధీకీ గత నెలలో దారుణంగా హయం చేసిన సంగతి తెలిసిందే.

బాంద్రాలో ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషాన్ సిద్ధీకీ ఆఫీసు ముందు దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన సిద్ధీకీ, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయారు. ఈ హత్యకు 15 రోజుల ముందు సిద్ధీకీకి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, సల్మాన్ ఖాన్‌కు ఆత్మీయుడు కావడం వల్లే బాబా సిద్ధీకీని హతం చేసినట్లు ప్రకటించింది. సల్మాన్ ఖాన్‌ను కూడా చంపేస్తామని బెదిరించారు. ప్రస్తుతం, జీషాన్ సిద్ధీకీకి కూడా బెదిరింపులు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వచ్చిన ఫోన్ కాల్ పోలీసులకు తీవ్ర అప్రమత్తతను కలిగించింది.

Related posts

ఫ్యాన్ కు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్ లేకుండా చేశారు

Satyam NEWS

సమంత ఒప్పుకుంటే యశోద సీక్వెల్స్ చేస్తాం

Bhavani

కూటమి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి

Satyam NEWS

Leave a Comment