39.2 C
Hyderabad
March 29, 2024 13: 26 PM
Slider ముఖ్యంశాలు

రామతీర్థం నీలాచలం కేసులో ముగ్గురి అరెస్టు

#VijayanagaramPoliceNew

రామతీర్థం నీలాచలం కొండపై జరిగిన విగ్రహ శిరస్సు ఖండన కేసు ఇంకా దర్యాప్తు జరుగుతోందని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ తెలిపి. నగరంలో సీసీఎస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. అన్ని కోణాల్లో నూ కేసును దర్యాప్తు చేస్తున్నామని….స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా నిర్విరామంగా పని చేస్తోందన్నారు.

 అన్యమతస్థులు చేసారన్న అంశాన్ని పరిశోధిస్తున్నామన్నారు.ముఖ్యంగా కొంతమంది ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఇక జిల్లా లో మూడు దేవాలయాలలో జరిగిన దొంగతనం దర్యాప్తు లో  3గురు నిందితులు పట్టుకున్నామన్నారు.

ఈ ముగ్గురూ పాత నేరస్థులేనని జిల్లా తో పాటు అంతరాష్ట్రాలలో కూడా దేవాలయాలలో సొత్తు అపహరించారని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా నగరంలోని వైఎస్సార్ నగర్ లోనూ,అలాగే గజపతినగరం మండలం బొబ్బాదిపేటలోనూ ,రామభద్రపురంలోనూ జరిగిన దొంగతనాలను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఛేధించారన్నారు.

ఈ మీడియా సమావేశంలో ఎస్పీతో పాటు డీఎస్పీలు అనిల్,పాపారావు, సీఐలు కాంతారావు, మురళీ ,శ్రీనివాసరివు ,ఎస్ఐ సన్యాసిరావుతో పాటు ఇతర స్టేషన్ ల ఎస్ఐలు ఉన్నారు.

Related posts

ఎస్సీ వర్గీకరణపై మాలలంతా ఐక్యంగా పోరాడాలి

Satyam NEWS

అవార్డు రావడంతో మరింత బాధ్యత : చైర్‌పర్సన్ ముల్లి పావని

Satyam NEWS

అగ్ని ప్రమాద బాధితులకు సిఐటియు ఆధ్వర్యంలో బియ్యం పంపిణి

Satyam NEWS

Leave a Comment