39.2 C
Hyderabad
April 25, 2024 17: 14 PM
Slider శ్రీకాకుళం

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో జీవిత ఖైదు

#Sessions Court

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తోట పాలెం పంచాయతీ తవిటయ్య నగర్ చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సత్యనారాయణ హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధించారు.

2014 తో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన 3 వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి  పి.అన్నపూర్ణ ముగ్గురికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.

సంత సీతాపురం పంచాయతీ పరిధిలోని అల్ల.డి.వి ప్రాంతంలో 2014 నవంబర్ 26 న గుర్తుతెలియని  వ్యక్తి మృతదేహం బయటపడింది.

అప్పటికి ఆ మృతదేహం పాక్షికంగా కాలిపోయింది. అప్పటి గ్రామ రెవెన్యూ అధికారి జి. వెంకటరమణ మూర్తి ఫిర్యాదు మేరకు ఏచర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.

జి. ఆర్.పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో  ముమ్మరంగా దర్యాప్తు చేశారు.  విచారణలో  మృతదేహం రియల్ ఎస్టేట్ వ్యాపారి శాంతి మహంతి సత్యనారాయణ గా గుర్తించారు.

కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు ఈ హత్యకు మృతుడి భార్య వెంకట సునీత నే ప్రధాన నిందితురాలు గా సాక్ష్యాలను బట్టి గుర్తించారు.

హత్య కేసులో ఈమెకు సహకరించిన బస్సువాని వెంకట్, పట్నాయక్  రాజు ఇద్దరు పైన హత్య కేసు నమోదు చేశారు.

సాక్ష్యాలను పరిశీలించిన శ్రీకాకుళం జిల్లా మూడవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి. అన్నపూర్ణ మంగళవారం సాయంత్రం తీర్పునిచ్చారు.

ఈ కేసులో నిందితులకు శిక్ష పడేటట్లు చేసిన  జె .ఆర్ .పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ కు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పుట్టా అంజిని కుమార్ కు,

జిల్లా బార్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ సభ్యులు, శ్రీకాకుళం జిల్లా అడ్వకేట్లు, పోలీస్ శాఖ వారు, ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Related posts

నల్లగొండ షీ టీమ్ పోలీసులను అభినందించిన డిజిపి

Satyam NEWS

నెలాఖరున సమ్మెలోకి బ్యాంకు ఉద్యోగులు

Satyam NEWS

శారదా శక్తి పీఠం సందర్శనకు ప్రయత్నాలు

Murali Krishna

Leave a Comment