కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్పుగొండ గ్రామ శివారు లో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామ శివారు లోని వ్యవసాయ బోరు బావి నుండి పంపు మోటార్ తీస్తుండగా పైపులకు కరెంట్ తీగలు తగలడంతో ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో గ్రామానికి చెందిన ఐలేని లక్ష్మారావు (60), ఐలేని మురళీధరరావు (55), ఇమ్మడి నారాయణ (42) లు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి మాచారెడ్డి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
previous post