31.2 C
Hyderabad
April 19, 2024 03: 35 AM
Slider శ్రీకాకుళం

మహానుభావులను గుర్తు చేసుకున్న సిక్కోలు వాసులు

#Srikakulam Youth

స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య ఈ ముగ్గురు మహనీయులకు జులై 4వ తేదీకి సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని ప్రపంచం మరచిపోయినా శ్రీకాకుళం పట్టణ వాసులు మాత్రం మరచిపోలేదు. శనివారం స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా గ్రౌండ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ముగ్గురు మహానుభావులకు ఘన నివాళి అర్పించారు.

స్వామి వివేకానంద నిర్యాణం జరిగిన రోజు నేడు. అదే విధంగా భారతదేశ పతాకం రూపకర్త అయిన పింగళి వెంకయ్య గారు మరణించిన రోజు కూడా ఇదే. మన్యం వీరుడు అయినా అల్లూరి సీతారామరాజు జయంతి కూడా నేడే. ఈ ముగ్గురు మహనీయుల గొప్పతనాన్ని భావితరాలకు తెలియ చేయాల్సిన అవసరం ఉందని శ్రీకాకుళం పట్టణం తెలగ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండ బాల  మోహన్ అన్నారు.

ఈ ముగ్గురు మహనీయుల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు.ఈ గొప్ప వ్యక్తుల జీవితాలను,  వారి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కే మురళి, కె నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కర్నాటకలో గోవధ నిషేధ ఆర్డినెన్సు జారీ

Satyam NEWS

మద్యం సిండికేట్ తో చేతులు కలిపిన సబ్ ఇన్ స్పెక్టర్

Satyam NEWS

అన్నమయ్య ప్రాజెక్టు నిండడంతో చెయ్యేటికి నీటి విడుదల

Satyam NEWS

Leave a Comment