25.7 C
Hyderabad
June 22, 2024 05: 52 AM
Slider తెలంగాణ

ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

kamareddy murder

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురైన ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామ శివారులో జంగంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన రెండు గ్రామాల్లో అలజడి సృష్టించింది. కామారెడ్డి డిఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం జంగంపల్లి గ్రామానికి చెందిన బందెల బాలయ్య అతని కూతురు లత, బాలయ్య తమ్ముడి కూతురు చందన లను బాలయ్య తమ్ముడు రవి శుక్రవారం సాయంత్రం బైకు మీద బయటకు తీసుకువెళ్లాడు. చీకటి పడినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పలు చోట్ల వెతికినా ఫలితం లేకపోయింది. దాంతో పోలీసులకు తెలియజేసారు. శనివారం ఉదయం దోమకొండ గ్రామ శివారులో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు ఉన్నాయని తెలియడంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మిస్సయిన వ్యక్తులు వారే అని తెలిసింది. మృతి చెందిన వారిలో బాలయ్య, లత, చందనలు మాత్రమే ఉన్నారు. రవి లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన స్థలంలో పురుగుల మందు డబ్బా, తమ్సప్ బాటిల్, గ్లాసులు కనిపించాయి. పక్కనే బ్లేడ్, తమ్సప్ తాగిన ఆనవాళ్లు కనిపించడంతో పురుగుల మందును తమ్సప్ లో కలిపి స్పృహ తప్పిన తరువాత ముగ్గురిని బ్లేడ్ తో కోసి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే గత నెల రోజుల క్రితం లత అదే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ వ్యవహారం రవికి నచ్చలేదు. అప్పటి నుంచి కుటుంబంలో పలు గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రవి వీళ్ళను బైక్ పై తీసుకువెళ్లడం, ముగ్గురు హత్యకు గురి కావడం, రవి కనిపించకుండా పోవడంతో ఈ హత్యలకు రవి కారణం అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వార్డ్ ను తెప్పించగా అది చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయింది. రవి. వాడిన బైక్ చెరువు వద్ద కనిపించింది. ఈ ముగ్గురిని హత్య చేసి రవి పారిపోయాడా లేక వీరిని చంపి రవి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Related posts

హుజూర్ నగర్ లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి

Satyam NEWS

కంకిపాడులో చైతన్య విద్యాసంస్థల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

Satyam NEWS

యజ్ఞం ప్రాంగణంలోకి చెప్పులతోనే వచ్చిన ప్రముఖులు

Satyam NEWS

Leave a Comment