అదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడిన జిల్లా. అయితే ఆ జిల్లాలోనే సరస్వతీ దేవి అవతరించింది. ఈ వైవిధ్యం ఉన్న అడవి పుత్రుల జిల్లాలో విద్యా కుసుమాలు వికసించాలనే సదుద్దేశంతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ అకాడమీ (TICAS) నేడు ఆర్ కె ఫంక్షన్ హాల్ లో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించింది.
ఈ అవగాహన సదస్సులో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ అకాడమీ సీఈవో నంబి విజయ సారథి పాల్గొని విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ పై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మంచి సేవ చేయాలనుకుంటే సివిల్ సర్వీసులో చేరి పేద బడుగు వర్గాలకు సేవ చేసే అవకాశం పొందవచ్చునని అందుకు సివిల్ సర్వీసు ద్వారా అవకాశం లభిస్తుందని అన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో చేసే అవకాశం కూడా లభిస్తుందని, దీని ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడమే కాకుండా ఇతరులకు ఆదర్శంగా ఉండవచ్చునని అన్నారు. సివిల్ సర్వీసులో చేరిన ప్రతి విద్యార్థి తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉంటారని అన్నారు.
సరస్వతి దేవి నిలయమైన ఈ జిల్లానుండి విద్యార్థులు సాంప్రదాయ కోర్సుల్లో కాకుండా సివిల్ సర్వీస్ వైపు కూడా దృష్టి సారించాలని అందుకే సివిల్ సర్వీస్ విలువను, ప్రాధాన్యతను తెలియజేయడానికే ఈ సదస్సును నిర్వహించామని అన్నారు.