38.2 C
Hyderabad
April 25, 2024 11: 47 AM
Slider ఆధ్యాత్మికం

అక్టోబరు 22 న ఆన్లైన్లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల విడుదల

#LordBalaji

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈ డి) టోకెన్లు అక్టోబరు 22 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో  విడుదల చేస్తారు. అయితే డిసెంబరు 8 వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం, డిసెంబరు 16వ తేదీ  ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ రెండు రోజులకు సంబంధించి శ్రీవారి ఆలయ కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ కార్యక్రమాల వివరాలు ఖరారయ్యాక డిసెంబరు 8 మరియు 16 వ తేదీలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు విడుదల చేస్తారు.

నవంబరు నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అక్టోబరు 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు.

తిరుమలలో వసతికి సంబంధించి నవంబరు నెల కోటాను అక్టోబరు 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయడం జరుగుతుందని టీటీడీ తెలిపింది.

భక్తులు ఈ విషయం గుర్తించి స్వామి వారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

Related posts

డాక్టర్ విశారదన్ మహారాజ్ పాదయాత్ర నేటితో పూర్తి

Satyam NEWS

SBI ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

Satyam NEWS

ఉత్తరాంధ్ర వాణి ని వినిపిద్దాం…రండి: వైఎస్సార్సీపీ

Satyam NEWS

Leave a Comment