29.2 C
Hyderabad
March 24, 2023 22: 03 PM
Slider ప్రత్యేకం

టిడ్కో లబ్దిదారులకు అన్యాయం చేస్తే ఉద్యమం

#chadalawada

టిడ్కో లబ్దిదారులకు అన్యాయం జరిగితే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు ఆయన టిడ్కో లబ్దిదారుల తరపున వినతిపత్రం అందజేశారు. అనంతరం డా౹౹చదలవాడ మాట్లాడుతూ ప్రభుత్వానికి టీడీపీ హయాంలో నిర్మించిన గృహాలకు సంబంధించి రూ.50 వేల డీడీని అందజేయడం జరిగిందన్నారు.

దీనిలో తిరిగి రూ.25 వేలు వెనక్కి ఇవ్వాలని కేంద్రం సూచన చేసిందన్నారు.తమ పార్టీ హయాంలోనే టిడ్కో ఇళను 80 శాతం పూర్తి చేసామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కొందరు లబ్దిదారుల పేర్లను తొలగించడం జరిగిందన్నారు. వారికి అన్యాయం జరిగిందన్నారు. ఇళ్ళులేని నిరుపేదలు ఎంతో మంది వాటి కోసం ఎదురు చూస్తున్నారన్నారు.

అవినీతిలో మునిగితేలుతున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అమ్మఒడి వంటి పథకాలతో పాటు టిడ్కో ఇళ్ళను ఉగాది నాటికి ఇవ్వాలన్నారు. లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తుందని డా౹౹చదలవాడ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పులిమి రామిరెడ్డి,కడియం కోటి సుబ్బారావు, సంజీవరావు, మాబు, కరిముల్లా, సుభాని తదితరులు ఉన్నారు.

Related posts

ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో రోశయ్య సంతాప సభ

Satyam NEWS

బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక గల్లీ లీడర్..

Satyam NEWS

ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌ల కానున్న పొగ‌రు

Sub Editor

Leave a Comment

error: Content is protected !!